Ravi Teja: ఆ నష్టాలను మాస్ మహారాజ్ భర్తీ చేస్తారా?

  • September 5, 2022 / 10:33 AM IST

మాస్ మహారాజ్ రవితేజకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే క్రాక్ తర్వాత రవితేజ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఖిలాడీ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలను మిగల్చగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఆ సినిమాను మించి నష్టాలను మిగిల్చింది. అయితే ఈ సినిమా నష్టాల భారం రవితేజపై కూడా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సుధాకర్ నిర్మాత కాగా రవితేజ కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.

శరత్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా మార్నింగ్ షో నుంచి డిజాస్టర్ టాక్ తో ప్రదర్శితమైంది. రవితేజ అభిమానులను సైతం ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఫలితంగా ఈ సినిమా బిజినెస్ కు అనుగుణంగా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. నిర్మాత సుధాకర్ తనకు వీలైన స్థాయిలో బయ్యర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చారని బోగట్టా. అయితే ఆ మొత్తం మరీ తక్కువ మొత్తం కావడంతో హీరో, నిర్మాణ భాగస్వామి అయిన రవితేజను కలవాలని ఆంధ్ర, సీడెడ్ బయ్యర్లు నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.

బయ్యర్ల నష్టాలను భర్తీ చేయడానికి మాస్ మహారాజ్ అంగీకరిస్తారో లేదో సమాచారం అందాల్సి ఉంది. రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ నిర్మాతగా కూడా నష్టాలను మిగల్చనుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న రవితేజ ప్రస్తుతం సరైన కథలను ఎంపిక చేసుకునే విషయంలో తడబడుతున్నారు.

బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న రవితేజ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. తర్వాత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోతే రవితేజ కెరీర్ పై ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus