Ravi Teja, Sreeleela: రవితేజ శ్రీలీల కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా?

  • June 11, 2024 / 06:26 PM IST

రవితేజ (Ravi Teja) శ్రీలీల (Sreeleela) కాంబినేషన్ లో తెరకెక్కిన ధమాకా (Dhamaka) సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా భాను భోగవరపు అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ గత సినిమా ఈగల్ (Eagle) భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.

తర్వాత సినిమాలతో కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లను సాధించాల్సిన బాధ్యత రవితేజపై ఉంది. కెరీర్ పరంగా గ్యాప్ రాకుండా ఆరు నెలలకు ఒక సినిమాలో నటిస్తున్న రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. మరోవైపు శ్రీలీల ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలలో హిట్టైన సినిమాల కంటే ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

యంగ్ హీరోలకు జోడీగా శ్రీలీల నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. తర్వాత సినిమాలతో వరుస విజయాలను అందుకుని శ్రీలీల పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీలీల రెమ్యునరేషన్ విషయంలో సైతం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రాజెక్ట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

సంక్రాంతి పండుగ కానుకగా ఇప్పటికే పలు సినిమాలు ఫిక్స్ కాగా ఆ జాబితాలో రవితేజ శ్రీలీల సినిమా కూడా ఫిక్స్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి పండుగను మిస్సైన రవితేజ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సినిమాల జాబితాలో రాబోయే రోజుల్లో మరికొన్ని సినిమాలు చేరే ఛాన్స్ అయితే ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus