‘రోబో’, ‘2.0’… ఈ రెండు సినిమాలు తమిళ పరిశ్రమ, సౌత్ సినిమా పరిశ్రమలోనే కాదు… మొత్తంగా దేశంలోనే భారీ విజయాన్ని అందుకున్నాయి. పాన్ ఇండియా సినిమాలు అంటూ ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కానీ… ఈ సినిమాలు ఆ పేరు లేకుండానే భారీ విజయాలు అందుకున్నాయి. ఒక సినిమాకు మించి మరో సినిమా విజయం సాధించింది కూడా. ఇప్పుడు ఈ సినిమాల గురించి ఎందుకు చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ రెండు సినిమాల రికార్డులు బద్దలుకొట్టే సినిమా రాబోతోంది కాబట్టి.
అందులోనూ పైన చెప్పిన రెండు సినిమాల కాంబినేషన్లో వచ్చే సినిమానే. ఇప్పటికే మీరు (Robo3) ‘రోబో 3’ గురించి అనుకుంటున్నారు అంటే… మీ అంచనా వందకు రెండొందల శాతం కరెక్ట్. శంకర్ – రజనీకాంత్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుంది అంటూ గత కొన్ని రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కాదని, శంకర్ చేతిలో ఉన్న రెండు సినిమాలు అయిపోయాక అని అంటున్నారు. అయితే ఆ సినిమా ‘రోబో 3’ అనేది లేటెస్ట్ టాక్. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘చిట్టి’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తాడు.
శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు. కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయిన తర్వాత మూడో ‘రోబో’ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అనేది తెలియడం లేదు. ఎందుకంటే శంకర్ ఇప్పటికే బాలీవుడ్లో రణ్వీర్ సింగ్‌తో ఓ సినిమా ఓకే చేశారు. ఆ మధ్య ఓపెనింగ్ కూడా అయిపోయింది.
ఈ లెక్కన ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ తర్వాత శంకర్ రణ్వీర్ సినిమా చేయాలి. ఇప్పుడు రజనీకాంత్ సినిమా అంటే అంత ఈజీనా అనే డౌట్ ఉంది. రెండోది ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ ‘రోబో’ లాంటి సినిమా మళ్లీ చేస్తారా అనేది కూడా ప్రశ్న. మరి అయితే ఇక్కడ విషయం ఏంటంటే… శంకర్ అయితే ఈ కథ విషయంలో చాలా ఈగర్‌గా ఉన్నారట.
మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!