అక్టోబర్ 13వ తేదీనే ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలవుతుందని రాజమౌళి అండ్ టీం ప్రకటించినా.. అది అసాధ్యమనే అభిప్రాయాలు విశ్లేషకుల నుండీ వినిపిస్తూనే ఉన్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ విషయం పై కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ కనుక అక్టోబర్లో రిలీజ్ అయితే సినీ పరిశ్రమ మొత్తం గాడిలో పడుతుంది అని చాలా డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అదంతా అసాధ్యమని ఇప్పుడు టాక్ బలంగా వినిపిస్తుంది.
అక్టోబర్ 13న ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే అవకాశాలు లేవు. ఇది 99శాతం ఫిక్స్.ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ లేదా రిపబ్లిక్ డే.. కి ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇన్సైడ్ టాక్. అయితే క్రిస్మస్ కు ‘పుష్ప’ రిలీజ్ కూడా ఉంది. అలాగే బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ మూవీ కూడా ఉంది. అలా అని వాటికి పోటీగా కాదు. క్రిస్మస్ కు 10 రోజుల ముందు అన్ని భాషల్లోనూ ఏ సినిమా రిలీజ్ కావడం లేదు.
ఇది కనుక ఫిక్స్ అవ్వకపోతే 2022 రిపబ్లిక్ డే కి రెండు రోజుల ముందు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ యుక్రేన్ లో జరుగుతుంది. అది ఫినిష్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెడతారు. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!