Samantha: అలా జరిగితే మాత్రమే సమంత కెరీర్ కు మేలు జరుగుతుందా?

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఖుషి సినిమా గతేడాది థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నా ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సమంత గత సినిమా యశోద బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలవగా సామ్ మరో మూవీ శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఖుషి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటే మాత్రమే సమంత కెరీర్ కు మేలు జరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఖుషి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఖుషి సినిమాలో సమంత రోల్ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత సమంత నటిస్తున్న లవ్ స్టోరీ ఇదే కావడం గమనార్హం. సమంత కెరీర్ తొలినాళ్లలో నటించిన లవ్ స్టోరీలు సక్సెస్ సాధించాయి. విజయ్ సమంత జోడీ గురించి ఎక్కువమంది పాజిటివ్ కామెంట్లు చేస్తుండగా కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

సమంత (Samantha )సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. సమంత ఒక్కో ప్రాజెక్ట్ కు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. గత కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఖుషి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తుండగా ఈ సినిమా కూడా అదే రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ బ్యానర్ గా ఉండటం గమనార్హం.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus