ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్‌పై చర్యలు తీసుకుంటూ అతడిపై పదేళ్ల ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకల్లో నటుడు క్రిస్ రాక్ మీద విల్ స్మిత్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ ను నవ్వించే క్రమంలో క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్యని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు.
స్మిత్ భార్య జాడా పింకెట్‌కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. ఈ విషయంలో హర్ట్ అయిన విల్ స్మిత్.. స్టేజ్ పైకి వెళ్లి క్రిస్ రాక్ ను చెంపదెబ్బ కొట్టారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కొందరు విల్ స్మిత్ ని సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేశారు. ఇక విల్ స్మిత్ చర్యలపై సమావేశమైన ఆస్కార్స్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్..
అతడిని పదేళ్ల పాటు ఆస్కార్ పురస్కార వేడుకలు సహా అకాడమీ నిర్వహించే ఏ కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిషేధం విధించింది. విల్ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులుగా విల్ స్మిత్ కి ఇచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డుని ఆస్కార్స్ వెనక్కి తీసుకోవచ్చని ప్రచారం జరిగింది.
అయితే అలాంటి నిర్ణయం అకాడమీ బోర్డ్ తీసుకోలేదు. నిషేధం విధించినప్పటికీ.. పదేళ్లు ఉత్తమ నటుడు విభాగంలో విల్ స్మిత్ నామినేషన్, విన్నింగ్ అవకాశాలు అలానే ఉంటాయి. విల్ స్మిత్ సినిమాలు, విల్ స్మిత్ ఆస్కార్స్‌కు నామినేట్ అయ్యే అవకాశాలపై ఎటువంటి నిషేధం లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!