విల్ స్మిత్ చెంపదెబ్బ వ్యవహారం.. ఆ పై ఏర్పడ్డ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఆ తర్వాత అతను బహిరంగ క్షమాపణలు కోరినా… AMPAS మాత్రం విషయాన్ని అక్కడితో వదిలెయ్య లేదు. AMPAS అధ్యక్షుడు ఈ విషయమై అస్కార్స్ (అకాడమీ) డిసిప్లినరీ కమిటీకి లేఖ రాయడం కూడా జరిగింది. విల్ స్మిత్ వ్యవహారం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాసిన లేఖ కారణంగా స్మిత్ పై తగిన చర్యలు తీసుకోవాలనే కఠిన నిర్ణయానికి కూడా వారొచ్చినట్టు తెలుస్తుంది.
అమిత్ భార్య జాడా పింకెట్ అనారోగ్యం పై ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ వెటకారంగా మాట్లాడిన కారణంగా విల్ స్మిత్ అతని చెంప చెల్లుమనిపించాడు. ఇది ఆస్కార్ 2022 కి బ్యాడ్ మూమెంట్ గా మారింది. ఆవేశంలో విల్ స్మిత్ ఈ రచ్చ చేసాడని అందరికీ స్పష్టమవుతుంది.కానీ 10మంది ముందు ఇలా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి పై చెయ్యి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఇది క్రిస్ రాక్ కు కూడా పెద్ద మెచ్చే అవుతుంది. ఆ కాసేపు హుందాగా ప్రవర్తించి ఉంటే ఇంత రచ్చకు దారి తీసేది కాదేమో..!
క్రిస్ రాక్‌ను స్మిత్ క్షమించమని కోరినప్పటికీ ఉపయోగం లేకపోయింది. హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి స్మిత్ రాజీనామా చేసేంతలా వెళ్ళింది వ్యవహారం. అంతేకాదు అతని సినీ కెరీర్ పై కూడా దీని ఎఫెక్ట్ పడనుందని స్పష్టమవుతుంది.విల్ హీరోగా ‘ఫాస్ట్ అండ్ లూజ్’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. అయితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రం కొనుగోలు హక్కులను ఉన్నపళంగా హోల్డ్ లో పెట్టిందట. ఆస్కార్ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోవడం జరిగింది.
ఈ ప్రాజెక్టుని ఆయన పక్కన పెట్టి ‘ఫాల్ గాయ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయినట్టు కూడా ప్రచారం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టుని వదిలించుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నట్టు కూడా ఇన్సైడ్ సిర్కిల్స్ చెప్పుకొస్తున్నాయి.. ఆ చెంప దెబ్బ వ్యవహారం లేకపోయి ఉంటే.. స్మిత్ కు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అనే టాక్ కూడా ఇప్పుడు హాలీవుడ్లో మార్మోగుతుంది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?