Sreeleela: రాబిన్ హుడ్ స్టోరీ లైన్ ఇదే.. శ్రీలీల అలాంటి రోల్ లో కనిపిస్తారా?

  • June 15, 2024 / 12:10 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీలీలకు మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. గుంటూరు కారం తర్వాత కొంతకాలం సైలెంట్ అయిన శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. రవితేజ (Ravi Teja) సినిమాలో శ్రీలీల మరోసారి హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఈ నెల 11న ప్రకటన రాగా రాబిన్ హుడ్ (Robinhood) సినిమాలో శ్రీలీల రోల్ కు సంబంధించి తాజాగా గ్లింప్స్ విడుదలైంది. నితిన్ (Nithiin) , శ్రీలీల (Sreeleela) కాంబోలో ఇప్పటికే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) అనే సినిమా వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సినిమా డిజాస్టర్ కావడంతో పాటు నితిన్, శ్రీలీల కాంబో సీన్లు సైతం ఆశించిన రేంజ్ లో లేవని కామెంట్లు వినిపించాయి. మరోవైపు నితిన్ కు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగిలాయి. రాబిన్ హుడ్ తో ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను శ్రీలీల బ్రేక్ చేస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.

రాబిన్ హుడ్ సినిమాలో నీరా వాసుదేవ్ అనే రోల్ లో శ్రీలీల కనిపించనున్నారు. ఈమె ధనవంతురాలి పాత్రలో కనిపించనుండగా నితిన్ ఈ సినిమాలో దొంగ రోల్ లో కనిపిస్తున్నారు. ఒక దొంగతనం ద్వారా నితిన్, శ్రీలీల పాత్రల మధ్య ప్రేమ మొదలవుతుందని కథలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని స్టోరీ ఇదే విధంగా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రాబిన్ హుడ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వెంకీ కుడుముల (Venky Kudumula) డైరెక్షన్ లో తెరకెక్కిన ఛలో (Chalo) , భీష్మ (Bheeshma) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధింఛాయి. రాబిన్ హుడ్ ఆ సినిమాలను మించి సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. మైత్రీ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus