శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) పరిచయం అవసరం లేని పేరు. ప్రశాంత్ నీల్(Prashanth Neel) – యష్ (Yash) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘కె.జి.ఎఫ్'(సిరీస్) తో (KGF) దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్లు కొట్టడంతో ఈమె దశ తిరిగింది అని అంతా అనుకున్నారు. వరుస సినిమాలతో అన్ని భాషల్లోనూ బిజీ అయిపోతుంది అని భావించారు. కానీ కట్ చేస్తే ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు. తమిళంలో చేసిన ‘కోబ్రా’ కూడా ప్లాప్ అయ్యింది.
అయితే తెలుగులో ఎట్టకేలకు ‘హిట్ 3’ (HIT 3) వంటి పెద్ద సినిమాలో నటించే అవకాశం తెచ్చుకుంది ఈ అమ్మడు. నాని (Nani) – శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మే 1న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి మృదుల అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ మాదిరి కాకుండా.. ఫైట్లు వంటివి కూడా చేసింది శ్రీనిధి. ఇంకో రకంగా కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర కూడా అని చెప్పాలి.
సరే అంతా బాగానే ఉంది. కానీ వాట్ నెక్స్ట్ అంటే? ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. కానీ గతంలో సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేసింది అని వినికిడి. ప్రస్తుతం స్టార్ హీరోలైతే ఖాళీగా లేరు. విజయ్ దేవరకొండ వంటి హీరోల సినిమాల్లో నటించే ఛాన్సులు వస్తాయేమో చూడాలి.