Naga Chaitanya: ఆ కారణంతో దిల్ రాజు ఆగిపోయారట..!

Advertisement

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగ చైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘థాంక్యూ’. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇది.. సినిమా కూడా అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని టీజర్ చెప్పకనే చెప్పింది. జీవితంలో ఓ పెద్ద స్థాయికి వచ్చిన ఓ హీరో.. అదంతా తన గొప్పతనమే అనే సెల్ఫిష్ గా వ్యవహరిస్తూ ఉంటాడు.అయితే ఒక్కసారిగా మారి తనకు జీవితంలో సాయం చేసిన వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళ సమస్యల్లో ఉంటే తీర్చి వాళ్లకి థాంక్స్ చెబుతూ వస్తుంటాడు అనేది స్టోరీ లైన్ అని తెలుస్తుంది.

బి.వి.ఎస్.రవి ఈ చిత్రానికి కథ అందించారు. అయితే సినిమా మొత్తం విక్రమ్ కె కుమార్ స్టైల్ లోనే సాగుతుందని వినికిడి. అతని సినిమాల్లో వైవిధ్యమైన అంశాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యిందట.కానీ అనేక కారణాల వల్ల విడుదల లేట్ అవుతూ వచ్చింది. మొత్తానికి జూలై రెండో వారంలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఈ చిత్రాన్ని ఎప్పుడో ఓటీటీ ఇచ్చేద్దాం అని నిర్మాత దిల్ రాజు అనుకున్నారట.

అప్పుడు టికెట్ రేట్ల వంటి ఇష్యు నడుస్తూ ఉండడం వల్ల ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ‘లవ్ స్టోరీ’ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి కాబట్టి ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ చిత్రాన్ని కనుక ఓటీటీకి ఇచ్చి ఉంటే దిల్ రాజు విమర్శల పాలయ్యేవారు. ‘వి’ విషయంలో అలాగే విమర్శల పాలయ్యారు దిల్ రాజు. కానీ తర్వాత ఆ సినిమా ఓటీటీకి ఇవ్వడమే మంచిదని అంతా అనుకున్నారు. మరి ‘థాంక్యూ’ రిజల్ట్ ఎలా ఉండబోతుందో..!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus