Prabhas: ఆ డైరెక్టర్ ప్రభాస్ కు మరపురాని హిట్ ఇస్తాడా?

షారుఖ్ ఖాన్ హీరోగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన పఠాన్ మూవీ అంచనాలకు మించి విజయం సాధించి హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరి పోస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ ఫుల్ రన్ లో 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం సిద్దార్థ్ ఆనంద్ 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని తెలుస్తోంది. మైత్రీ నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్నారు. అయితే సిద్దార్థ్ ఆనంద్ ఫ్యాన్స్ లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేశారు.

ప్రభాస్ కు సిద్దార్థ్ ఆనంద్ మరపురాని హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కొత్త తరహా సినిమాలను ఎంచుకుంటున్నారు. ప్రభాస్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో గత సినిమాలను మించిన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నటుడిగా ప్రభాస్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus