పుష్ప(Pushpa) .. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది.పుష్ప.. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది.పుష్ప.. ఇప్పుడు ఇండియాలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ‘పుష్ప 2’ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రూ.1,000 కోట్లు సునాయాసంగా సాధించేలాగా ఉంది. ఇప్పటికే ఆ ఫిగర్‌కి చాలా దగ్గరగా వచ్చింది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇదే ఏడాది టాలీవుడ్ నుంచి విడుదలైన మరో బిగ్గెస్ట్ రిలీజ్ ‘దేవర'(పార్ట్ 1) (Devara) అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కూడా రూ.500 కోట్ల దాకా కలెక్ట్ చేసింది.
రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా చేశాక ఏ హీరో అయినా ఫ్లాపే చవిచూస్తాడనే ఒక సెంటిమెంట్‌ని దీంతో బ్రేక్ చేశాడు తారక్. దీనికి పార్ట్ 2 ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ స్పష్టంచేశారు. పుష్ప 2తో టాలీవుడ్ రేంజ్ చాలా పెరిగింది. ‘దేవర పార్ట్ 1’ కూడా ‘పుష్ప 2’ లాగా గొప్పగా తీస్తే అది కూడా మన తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచొచ్చు. బన్నీ (Allu Arjun) ‘పుష్ప 2’ మూవీ కోసం 3 ఏళ్ళు కేటాయించాడు. పుష్ప 3 కోసం ఇంకో మూడేళ్లు కేటాయించడానికి కూడా తాను రెడీ అని ఈ ఐకాన్ స్టార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
అందుకే ‘పుష్ప 3’కి సైతం సుకుమార్ (Sukumar) ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ‘పుష్ప’ ఫ్రాంచైజీ లాంగ్ సిరీస్‌గా మారే సంకేతాలు ముందు నుంచే వ్యక్తపరుస్తున్నారు మేకర్స్. అయితే అల్లు అర్జున్ ముందు ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి త్రివిక్రమ్ (Trivikram) మూవీ. మరోవైపు సుకుమార్ త్వరలోనే రామ్ చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరూ వారి వారి కమిట్‌మెంట్స్ పూర్తి చేసేసరికి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే మేకర్స్ ‘పుష్ప: ది రాంపేజ్’ షూటింగ్ ని 2025లోనే ప్రారంభించేలా ఉన్నారు.
నార్త్ ఆడియన్స్ పుష్ప మేనియా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చేలాగా కనిపించడం లేదు. “పుష్ప-3″లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కూడా కనిపించనున్నట్లు ఒక హింట్ ఇచ్చేశారు. దీనివల్ల దీనిపై ఇంకా హైప్స్ పెరిగాయి. ప్రతి పార్ట్ తో పుష్ప బాగా అలరిస్తోంది కాబట్టి ఇంకో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎక్కువ సమయం వెయిట్ చేయకపోవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సుకుమార్ కూడా దాన్ని త్వరగా పట్టాలెక్కించవచ్చు. ఈ మూవీతో బన్నీ ఆస్కార్ అవార్డుకే గురి పెట్టొచ్చు.
ఇక దేవర పార్ట్-1 సినిమాతో హిట్టైతే అందుకున్నాడు కానీ 1000 క్రోర్ చేరలేకపోయాడు తారక్. కానీ పార్ట్-2తో ఒక బాహుబలి (Baahubali) లాంటి హిట్ సాధించి తానో పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొరటాల శివ (Koratala Siva) కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్ట్ మరింత గొప్పగా తీయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ రెండు సినిమాలు ఒకటి, రెండేళ్లలో వస్తే టాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ కి చేరుకుంటుందని అనడంలో సందేహం లేదు. ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా పుష్ప ఇప్పటికే హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది.