KGF: ‘కేజీఎఫ్’ అభిమానులు గుడ్ న్యూస్.. మరో పార్ట్ కూడా ఉందట!

కన్నడ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్ ఫ్రాంచైజీలో మరిన్ని సినిమాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇక్కడైతే ‘కేజీఎఫ్’ ఫుల్ స్టాప్ పెట్టాలనుకోవడం లేదు దర్శకుడు ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్2’కి కొనసాగింపుగా ‘కేజీఎఫ్3’ ఉండబోతుందని హింట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

Click Here To Watch NOW

ఈరోజు విడుదలైన ‘కేజీఎఫ్ 2’ ఎండింగ్ లో పార్ట్ 3 గురించి హింట్ ఇచ్చారు. ఈసారి స్టోరీ ఎక్కడ జరగబోతుందో కూడా చెప్పేశారు. ఇప్పటివరకు ఇండియాలోనే జరిగిన ఈ స్టోరీ ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండబోతుంది. ‘కేజీఎఫ్2’ సినిమా పూర్తయిన తరువాత ఎండింగ్ కార్డ్స్ లో వచ్చే సన్నివేశాల్లో ‘కేజీఎఫ్3’ ఉంటుందని పరోక్షంగా వెల్లడించారు. ఆ సీన్ ఏంటంటే.. రాకీభాయ్ వస్తుంటే.. అతడి షిప్ ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడడం చూపించారు.

రాకీభాయ్ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించినట్లు చూపించారు. రాకీభాయ్ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్లు కూడా చూపించారు. దీన్ని బట్టి ‘కేజీఎఫ్’కి పార్ట్ 3 కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి అమెరికాలో రాకీభాయ్ ప్రభంజనం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్నేళ్లు ఆగాల్సిందే. ఇక ‘కేజీఎఫ్2’లో కొత్త స్టార్స్ చాలా మందిని యాడ్ చేశారు. విలన్ గా సంజయ్ దత్ నటించగా.. రవీనా టాండన్ కీలకపాత్ర పోషించింది.

అలానే రావు రమేష్, ప్రకాష్ రాజ్ ఇలా చాలా మంది తారలు కనిపించారు. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus