Prabhas: ఈ ఏడాది రెండు.. వచ్చే ఏడాది మూడు.. వర్కౌట్ అయ్యే పనేనా..!

ప్రభాస్ అతి త్వరలో ‘ఆదిపురుష్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్యనే ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ప్రభాస్ మాట్లాడుతూ.. ‘నేను తక్కువ మాట్లాడతాను ఎక్కువ సినిమాలు చేస్తాను. ఏడాదికి రెండు సినిమాలు వస్తాయి. మూడు కూడా రావచ్చు చెప్పలేం. సినిమాలు లేటైతే నాకు సంబంధం లేదు. నేనైతే ఫాస్ట్ గా సినిమాలు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఇలా చెప్పడం కొత్త కాదు.

గతంలో ‘బాహుబలి'(సిరీస్) టైంలో, ‘సాహో’ సినిమా టైంలో (Prabhas) ప్రభాస్ ఇలానే చెప్పాడు. కానీ ఏడాదికి రెండు సినిమాలు వచ్చిన సందర్భాలు అయితే లేవు. అందుకు కోవిడ్ అనేది పెద్ద కారణం కాబట్టి.. అభిమానులు కూడా ప్రభాస్ కామెంట్లను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ మళ్ళీ ఇలా చెప్పాడు. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ చెప్పింది జరిగే అవకాశం ఉంది.

‘ఆదిపురుష్’ మరో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 28 న ‘సలార్’ రిలీజ్ అవుతుంది. సో ఈ ఏడాదికి రెండు వచ్చేస్తాయి. ఇక వచ్చే ఏడాది ‘ప్రాజెక్ట్ కె’, మారుతీతో చేస్తున్న సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి.మరి మూడో సినిమా కూడా రిలీజ్ అవ్వొచ్చు అని ప్రభాస్ హింట్ ఇచ్చాడు. ఆ మూడో సినిమా సలార్ అవుతుందా? లేక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న సినిమా అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus