2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమా ఇద్దరికి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు వరలక్ష్మీ శరత్ కుమార్ కాగా మరొకరు హనీ రోజ్ కావడం గమనార్హం. హనీ రోజ్ ఈ సినిమాతో తాను మంచి నటిని అని ప్రూవ్ చేసుకుంది. వీరసింహారెడ్డి ఫలితం ఎలా ఉన్నా సీనియర్ హీరోలకు హనీ రోజ్ రూపంలో బెస్ట్ ఆప్షన్ దొరికిందని చెప్పవచ్చు. వాస్తవానికి బాలయ్యకు భార్యగా నటించడానికి హీరోయిన్లు అంగీకరించినా బాలయ్యకు తల్లిగా నటించడానికి మాత్రం హీరోయిన్లు అంగీకరించరు.
అయితే హనీ రోజ్ మాత్రం రిస్కీ రోల్ ను ఎంచుకుని ఫ్యాన్స్ ను మెప్పించారు. శృతి హాసన్ తో పోలిస్తే హనీ రోజ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పాటు ఆమె తన అద్భుతమైన అభినయంతో మెప్పించి ఫ్యాన్స్ ను ఊహించని స్థాయిలో ఆకట్టుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ క్రాక్ సినిమాతో ఇప్పటికే మెప్పించగా భానుమతి పాత్ర ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలో నటించిన వరలక్ష్మి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారనే చెప్పాలి.
అయితే స్క్రీన్ ప్లే కొత్తగా ఉండి ఉంటే బాలయ్య వరలక్ష్మి కాంబో సీన్లు అభిమానులను మరింత ఎక్కువగా ఆకట్టుకునేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లో మరిన్ని విభిన్నమైన పాత్రలతో బిజీ అవుతారని చెప్పవచ్చు. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ తో పాటు కథలో ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి మెప్పించగలరు.
తెలుగులో రాబోయే రోజుల్లో వరలక్ష్మి మరింత బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది నటీనటుల పారితోషికంతో పోల్చి చూస్తే వరలక్ష్మి రెమ్యునరేషన్ తక్కువేనని బోగట్టా. థమన్ మాత్రం బాలయ్య సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మ్యూజిక్, బీజీఎం ఇస్తున్నారని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!