Trivikram, Mahesh Babu: త్రివిక్రమ్‌ – మహేష్‌ సినిమాపై కొత్త చర్చ!

మహేష్‌బాబు – త్రివిక్రమ్‌… ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందుకే ఈ ఇద్దరూ కలసి సినిమా చేస్తున్నారు అంటే… అంచనాలు ఆశాకాశాన్ని అంటుతుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఈ ఇద్దరూ కలసి ఓ మంచి సినిమా ఇస్తుంటారు. కానీ అది వెండితెర మీద ఆ స్థాయి వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. అలా అని ఫ్లాప్‌ అయ్యాయనీ కాదు. మంచి సినిమాలుగా మిగిలిపోతున్నాయంతే. దీంతో ఈ కాంబినేషన్‌ గురించి చర్చ వస్తేనే మహేష్‌ ఫ్యాన్స్‌కి అంత ఆసక్తి ఉండటం లేదు. కానీ సరైన సినిమా రావాలి ఈ ఇద్దరి నుండి అని మాత్రం ఉంది.

Click Here To Watch

అయితే మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబో గురించి ఎదురుచూపులు తొలగిపోయి ఎట్టకేలకు సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ నేపథ్యంలో సగటు మహేష్‌ అభిమాని ఏం ఆశిస్తున్నాడో సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. మహేష్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఇప్పటివరకు ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి. ఆ తర్వాత 12 ఏళ్లకు ఇప్పుడు కొత్త సినిమా స్టార్ట్‌ అయ్యింది. ‘అతడు’ విషయానికొస్తే… థియేటర్లలో బాగుంది అనిపించుకుంది. కొన్ని కారణాల వల్ల సినిమాకు భారీ వసూళ్లు అయితే రాలేదు. ఇక ‘ఖలేజా’ అయితే థియేటర్లలో నిరాశపరిచింది. కానీ టీవీల్లో బాగానే చూశారు.

దీంతో ఈసారి త్రివిక్రమ్‌ కథ, కథనం విషయంలో తన మ్యాజిక్‌ పక్కాగా చూపించాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఈ సారి బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని ఫిక్స్‌ అవుతున్నారు. దీనికి తగ్గట్టే సినిమా కథ, నేపథ్యం గురించి చాలా రోజుల నుండి చర్చ నడుస్తోంది. ‘అతడు’కి ప్రీక్వెల్‌ అని కొందరు అంటుంటే, కాదు అలాంటి కథే ఇంకొకటి అంటున్నారు. అయితే త్రివిక్రమ్‌ ఏ సినిమా తీసినా… అందులో తన మార్కు పక్కాగా ఉండేలా చూసుకుంటారు. ఇటీవల కాలంలో త్రివిక్రమ్‌ తన మార్కును వైడ్‌ చేశారు.

కేవలం ఫ్యామిలీ స్టోరీలు మాత్రం చేయకుండా కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఫుల్‌గా ఉండే మాస్‌ యాక్షన్‌ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్‌ కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారో చూడాలి. కథ పాతగా ఉన్నా… మహేష్‌ను కొత్తగా చూపిస్తే సరి. ఆటోమేటిగ్గా ఎక్కేస్తుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus