Veera Simha Reddy: ఆ రికార్డును బాలయ్య సొంతం చేసుకుంటారా?

స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాలయ్య అభిమానులకు విపరీతంగా నచ్చగా సాధారణ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. ఓవర్సీస్ లో వీరసింహారెడ్డి మూవీ వన్ మిలియన్ డాలర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఓవర్సీస్ లో ఫుల్ రన్ లో ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ రికార్డును బాలయ్య సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

వీరసింహారెడ్డి మూవీకి ఈ వీకెండ్ లో కూడా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. వీరసింహారెడ్డి ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. ఈ నెల 26వ తేదీ వరకు థియేటర్లలో కొత్త సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అప్పటివరకు వీరసింహారెడ్డి మూవీ కలెక్షన్లకు ఢోకా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరసింహారెడ్డి మూవీ మాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ కొత్త షెడ్యూల్ తాజాగా మొదలైందని సమాచారం అందుతోంది.

నెలరోజుల పాటు ఈ సినిమా షూట్ జరగనుందని బోగట్టా. ఫ్యామిలీ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని సమాచారం. బాలయ్య, శ్రీలీల కాంబో సీన్లను ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించే బ్యూటీకి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా

డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. బాలయ్యతో తెరకెక్కించే సినిమా విషయంలో అనిల్ రావిపూడి పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సాహో గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus