దగ్గుబాటి రానా.. తనకు పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్ హీరో ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ఇప్పటికీ చేయడం లేదు కూడా. విభిన్న కథాంశంతో కూడుకున్న సినిమాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క ఎక్కువగా అతను మల్టీస్టారర్ సినిమాల్లోనూ, పరభాషా సినిమాల్లోనూ నటిస్తూ ఉంటాడు. రానా ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన సందర్భాలు చాలా తక్కువ. ఈ 5 ఏళ్లలో అతను ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన సినిమాలు ‘విరాటపర్వం’ కాకుండా కేవలం రెండే రెండు.
ఒకటి ‘ఘాజీ’ కాగా మరొకటి ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక రానా చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన మూవీ ‘విరాట పర్వం’. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. నిన్న ఈ చిత్రం స్పెషల్ షో వేయగా దానికి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. రానా కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ అని.! ఈ సినిమాలో రానాని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని సినిమా..
చూసాక విమర్శకులు చేసిన కామెంట్లు ఇవి. కచ్చితంగా ఈ మూవీ ఓ మంచి సినిమాని చూసిన ఫీలింగ్ ను కలిగిస్తుంది. కానీ థియేట్రికల్ రిజల్ట్ ను బట్టే సినిమా హిట్టా ప్లాపా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా రానాకి ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ ను అందిస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో విడుదలయ్యే సినిమాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు.
ఇలాంటి క్రమంలో ‘విరాట పర్వం’ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రయోగాత్మక చిత్రాలకి దూరంగా ఉంటానని రానా చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి ఇక నుండి అతను కమర్షియల్ సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది.