జీవా – మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర 2’. ఇలా చెప్పడం కంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం అంటే ఈజీగా తెలుస్తుంది. మహి. వి. రాఘవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలవుతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకు, ఏంటి అనే డౌట్ మీకు కూడా వచ్చే ఉంటుంది. దీనికి కారణం ‘వ్యూహం’ సినిమా అంటున్నారు.
ఏపీ రాజకీయాల మీద ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కించారు. రెండు పార్టులుగా రూపొందుతున్న ఆ సినిమాలో తొలిపార్టు ‘వ్యూహం’ ఈ నెల 8న విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలను నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఉంటుందని కూడా చెప్పింది.
ఆ విషయంలో త్వరలో క్లారిటీ వస్తుంది. ఈ విషయాన్ని బేస్ చేసుకుని ‘యాత్ర 2’ సినిమాకు కూడా ఇలాంటి ఇబ్బందులే రావొచ్చు అనేది లేటెస్ట్ చర్చల సారాంశం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు ఎలా ఉంటాయి, ఏం మాట్లాడతాయి అనేది ఇప్పటికే ట్రైలర్‌లో చూపించేశారు దర్శకుడు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రలు ఆ ట్రైలర్‌లో కనిపించాయి. వాళ్ల మాటలు కూడా రాజకీయ రచ్చను రేపేవిలానే ఉన్నాయి.
వాటిని ఆధారంగా చేసుకుని ఈ సినిమా మీద కూడా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏమవుతుంది అనేది లేటెస్ట్ ప్రశ్న. అయితే సినిమాల విషయంలో న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన కొన్ని తీర్పుల ప్రకారం చూస్తే సినిమాను విడుదలను నిలిపేయడం తాత్కాలికమే. ఒకవేళ అలా ‘వ్యూహం’ విడుదలకు మార్గం సుగమమైతే ‘యాత్ర 2’ కూడా వచ్చేస్తుంది. కాబ్టి రెండో ‘యాత్ర’ భవిష్యత్తు ‘వ్యూహం’ చేతుల్లో ఉంది అంటున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!