మహాలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ లో కృష్ణ వంశీ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన తోట శ్రీకాంత్ కుమార్ రచన & దర్శకత్వంలో పప్పు బాలాజీ రెడ్డి నిర్మాత గా ఆగస్టు 1వ తేదీన విడుదల అవుతున్న చిత్రం “థాంక్యూ డియర్”. ఈ చిత్రంలో హీరోయిన్ గా హెబ్బా పటేల్, త్రంత మూవీ ఫేమ్ ధనుష్ రఘుముద్రి హీరోగా, రేఖ నిరోషా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఎలిమెంట్స్, కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే తో వరల్డ్ బర్నింగ్ ఇష్యూ గురించి వివరించిన ఈ చిత్రం విడుదల కాకముందే హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరగడమే కాక 15th గోవా ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ తో పాటు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కరెంట్ అఫ్ఫైర్స్ చే రిజిస్టర్ కాబడిన బెంగళూరు ఇండియా ఆర్ట్ అండ్ లిటలేచర్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ వెల్రెడ్ అసోసియేషన్ నుంచి హెబ్బా పటేల్ ఉత్తమ నటిగా, డెబ్యూ ప్రొడ్యూసర్ గా పప్పు బాలాజీ రెడ్డి, సహాయ నటీనటులుగా నాగ మహేష్ , రేఖ నిరోషా అవార్డ్స్ పొందారు. ఇటీవల విడుదలైన పాటకు, ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవి ప్రకాశ్, నాగ మహేష్, వీర శంకర్, ఛత్రపతి శేఖర్, మీనాకుమారి, బేబీ ప్రభావతి, బలగం సుజాత, సంక్రాంతి శ్రీనివాస్ నాయుడు, వీనిషా, వర్దిని, పప్పు చందు తదితరులు నటించగా పిఎల్కే రెడ్డి డీఓపీగా పని చేశారు. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీకాంత్ తోట మాట్లాడుతూ… “మా థాంక్యూ డియర్ చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నమస్కారం. చిత్ర ప్రమోషన్స్ కు మీడియా వారు మొదటి నుండి ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాను ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ను తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఫ్యామిలీ అంతా చూసే విధంగా చేసాము. నాకు సపోర్ట్ చేసిన నిర్మాత బాలాజీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమాలో కథ ఎంత ముఖ్యమో స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. ఈ సినిమా అంతా కట్ బ్యాక్ స్క్రీన్ ప్లే లో ఉండబోతుంది. ఒక మంచి సందేశం తో అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను ఉండబోతుంది. అలాగే చిత్రానికి ఇప్పటికే ఎన్నో అవార్డులు రావడం విశేషం. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత బాలాజీ మాట్లాడుతూ… “మీడియా వారి అందరికీ వచ్చినందుకు థాంక్స్. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నాను. చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక బృందం అంతా సినిమాకు బాగా సపోర్ట్ చేశారు” అన్నారు.
హీరో ధనుష్ రఘుముద్రి మాట్లాడుతూ… “నన్ను మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు తన తొలి చిత్రంలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గారితో అలాగే రేఖా నిరోషా గారితో కలిసి పని చేయడం అనేది సంతోషకరం. ఈ సినిమా నాకు స్పెషల్ గా ఉంటుంది. ఆగస్టు 1వ తేదీన మా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను” అన్నారు.
హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ… “మా చిత్ర ఈవెంట్ కు వచ్చిన మీడియా వారి అందరికీ థాంక్స్. మీడియా వారితో మాట్లాడిన ప్రతిసారి నాకు ప్రత్యేకంగానే ఉంటుంది. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకునికి ధన్యవాదాలు. నాతో కలిసి నటించిన ధనుష్ గారికి, హెబ్బా గారికి థాంక్స్. మా సినిమాను అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకులంతా థియేటర్లలో మా సినిమాను చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ పునీత్ మాట్లాడుతూ… “ఈ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థాంక్స్. ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న థాంక్యూ డియర్ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను” అన్నారు.
సంగీత దర్శకుడు సుభాష్ మాట్లాడుతూ… “నాకు ఈ చిత్రానికి పని చేసేందుకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, నిర్మాత బాలాజీ గారికి నా ధన్యవాదాలు. నాకు ఈ సినిమాకు పనిచేసే సమయంలో బాలాజీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడంతోనే మేము బాగా పని చేయగలిగాము. ఇటువంటి మరెన్నో సినిమాలు ఆయన చేయాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించారు.
నటి నటులు – హెబా పటేల్ , ధనుష్ రఘుముద్రి , రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ శ్రీనివాస్ నాయుడు తదితరులు.
బ్యానర్ : మహా లక్ష్మి ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్ : పప్పు బాలాజీ రెడ్డి
రైటర్ & డైరెక్టర్ – తోట శ్రీకాంత్ కుమార్
ఎడిటర్ : రాఘవేంద్ర పెబ్బేటి
మ్యూజిక్ – సుభాష్ ఆనంద్
డి ఓ పి : పి ఎల్ కె రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ – బలిజ పునీత్ రాయల్
కో ప్రొడ్యూసర్ – పి బి వి వి సత్య నారాయణ
కాస్ట్యూమ్ డిజినర్ – భావన పోలిపల్లి
పి ఆర్ ఓ – మధు వి ఆర్
డిజిటల్ – డిజిటల్ దుకాణం