విచారణలో షాకింగ్ విషయాలు రాబట్టిన పోలీసులు.. సాయి ధరమ్ తేజ్ కోసం వచ్చిన ఆ మహిళ ఎవరంటే..?

తెరమీద హీరోయిజం చూపించే కథానాయకులను అభిమానించని వారెవరూ ఉండరు.. అభిమానం, వీరాభిమానం పక్కన పెడితే.. ఆ అభిమానం అనేది వెర్రి తలలు వేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇప్పటికే చాలా సంఘటనలు చూశాం.. వేదిక మీద హీరో మాట్లాడేటప్పుడు.. సడెన్‌గా వచ్చి కాళ్ల మీద పడడం.. బౌన్సర్లు వచ్చి పక్కకి తోసేస్తుంటే.. హీరో వద్దని వారించడం ఆ మధ్య ట్రెండ్ అయింది. ఇక తమ ఫేవరెట్ యాక్టర్లను కలవాలని కొంతమంది ఫ్యాన్స్ వందల కిలీమీటర్లు పాదయాత్ర చేసి హైదరాబాద్ రావడం..

చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వాళ్లని కలవడం లాంటివి కూడా జరిగాయి.. అయితే ఇప్పుడో మహిళ ఏకంగా.. మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిందనే వార్త మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.. సాయి తేజ్‌ను కలవడానికి రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు.. ఆమెను స్టేషన్‌కి తరలించి.. విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమినాడు రాష్ట్రంలోని మధురైకి చెందిన జోష్‌ కమల అనే మహిళకు సాయి ధరమ్‌ తేజ్‌ అంటే చెప్పలేనంత ఇష్టమట.. చాలా రోజుల నుంచి ఆమె తన అభిమాన హీరోను కలవాలనుకుంటూ.. ఇటీవలే కష్టపడి హైదరాబాద్‌కు వచ్చింది. వచ్చీ రావడంతోనే ప్రయత్నాలు ప్రారంభించింది. సాయి ధరమ్‌ తేజ్‌ ఇళ్లు ఎక్కడుందో అడ్రెస్ రాబట్టింది.. నేరుగా సాయి తేజ్‌ ఇంటికి వెళ్లింది. తర్వాత ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది.

అది గమనించిన భద్రతా సిబ్బంది ఆమెను అడ్డగించారు. కమలను పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. సాయి ధరమ్‌ తేజ్‌ను కలవడం కోసమే హైదరాబాద్ వచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో కమలకు మతిస్థిమితం సరిగా లేదనే విషయాన్ని గుర్తించారు పోలీసులు.. దర్యాప్తు పూర్తయ్యాక కమలను తన స్వస్థలానికి పంపనున్నారు. బుధవారం (డిసెంబర్ 7) తేజ్ నటిస్తున్న ‘విరూపాక్ష’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ చెప్పిన ఈ వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus