“వకీల్ సాబ్” కు మహిళల బ్రహ్మరథం
- April 13, 2021 / 10:27 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఫిల్మ్ వకీల్ సాబ్ కు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్ల దగ్గర మగువల సందడి కనిపిస్తోంది. చాలా చోట్ల 80 పర్సెంట్ థియేటర్స్ ఆక్యుపెన్సీ మహిళలతోనే ఉంటోందంటే వకీల్ సాబ్ ఎంత బాగా వాళ్లను ఆకట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. పవర్ స్టార్ ఫ్యాన్స్, యూత్ ఎలాగూ సినిమా చూస్తుంటారు. అయితే మహిళలు థియేటర్లలో పెద్ద సంఖ్యలో అడుగుపెట్టడంతో ఆయా థియేటర్లు కళకళలాడుతున్నాయి.
వకీల్ సాబ్ ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద మగువల సందడి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి సినిమా చేరాలో వారికి సినిమా దగ్గరైందంటూ కొందరు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. వైజాగ్ లో అనాథ బాలలను సందీప్ పంచకర్ల అనే డాక్టర్ వకీల్ సాబ్ మూవీకి తీసుకెళ్లారు. వాళ్లు సినిమా చూస్తూ ఎంతో సంతోషించారని ఆయన ట్వీట్ చేశారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
















