Naatu Naatu Song: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫాస్ట్‌ స్టెప్‌ నేర్పిస్తున్నారు!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా నుండి ఇటీవల ‘నాటు నాటు…’ అంటూ ఓ పాట వచ్చింది చూశారా? అందులో ‘నాటు నాటు..’ అనే బీట్‌ వచ్చేటప్పుడు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ఓ స్టెప్పేస్తారు చూశారా? భలే ఉంటుంది ఆ స్టెప్‌. ఏదో మామూలు స్టెప్‌లా కాకుండా… వాళ్లు ఎందుకు బెస్ట్‌ డ్యాన్సర్లో చెప్పేలా ఉంటుందా స్టెప్‌. చూడటానికి ఏదో సరదాగా గంతులేసినట్లు ఉంటుంది. కానీ చాలా క్రిటికల్‌ స్టెప్‌ అది. ఇప్పుడు ఆ స్టెప్‌ను చాలామంది నేర్పిస్తున్నారు… అది కూడా ఆన్‌లైన్‌లో.

పాటలోని మెయిన్‌ స్టెప్‌ను హుక్‌ స్టెప్‌ అంటుంటారు. పాట మొత్తానికి కీలకంగా ఉంటుందా ఆ స్టెప్‌. అలా ‘నాటు నాటు’ పాటకు ఆ ఫుట్‌ ట్యాపింగ్‌ స్టెప్‌ హుక్‌ స్టెప్‌. దీనిని కొంతమంది చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. అంతే కాదు దానిని ఎలా వేయాలో కూడా చేసి చూపిస్తున్నారు. వాళ్లు చెప్పింది చెప్పినట్లు చేసి, ప్రాక్టీస్‌ చేస్తే ‘నాటు నాటు..’ స్టెప్‌ను మీరు కూడా వేయొచ్చు. కావాలంటే ఈ దిగువ వీడియోలు చూసి మీరు కూడా ట్రై చేయండి.

ఇంత ఫాస్ట్‌ స్టెప్‌ ఉన్న పాట గురించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ను 0.5x స్పీడ్‌తో చూసినా ఫాస్ట్‌గానే కనిపిస్తుంది అని చాలామంది ట్వీట్లు చేస్తున్నారు. దానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ స్పందిస్తూ… మేం 2x స్పీడ్‌తో ఎడిట్ చేద్దామనుకున్నాం. కానీ మా డ్యాన్సింగ్‌ డైనమైట్స్‌ తారక్‌, చరణ్‌ ఆ అవసరం లేకుండా అదే స్పీడ్‌తో డ్యాన్స్‌ చేసి ఆశ్చర్యపరిచారు అని చెప్పుకొచ్చింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!






ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus