Yami Gautam: పబ్లిసిటీతో అన్ని సాధించలేరు!: యామి గౌతమ్

యామి గౌతమ్ పరిచయం అవసరం లేని పేరు ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈమె అనుకున్నంత స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇక పలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా ఈమె భారీగా పాపులర్ అయ్యారు.

ఇలా ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల ప్రమోట్ చేయడంలో నటీనటులు భారీగా ఆసక్తి చూపుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంస్కృతి పెరిగిపోతుందని ఈమె తెలియజేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాలో నటించిన వారు కూడా వెంటనే పాపులర్ అవుతున్నారు.

చాలామంది సక్సెస్ అందుకోవడం కోసం కొన్ని సంవత్సరాల పాటు కష్టపడాల్సి వస్తుందని ఈమె తెలియజేశారు.మరి కొంతమంది పబ్లిసిటీ ద్వారా ఫేమస్ అవ్వాలని చాలా తాపత్రయపడుతుంటారు అయితే ఇలా పబ్లిసిటీ ద్వారా ఫేమస్ అవ్వాలని కోరుకునేవారు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడలేరు అంటూ ఈమె తెలియజేశారు.ఇలా ప్రతి ఒక్కరూ మార్కెటింగ్ పైన దృష్టి పెడుతున్నారని సాంకేతిక వర్గం వైపు దృష్టి పెట్టడం లేదంటూ ఈమె వెల్లడించారు.

తన విషయానికి వస్తే తాను ఇలాంటి పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటానని (Yami Gautam) యామి గౌతమ్ వెల్లడించారు. కేవలం ప్రతిభను నమ్ముకుని మనం కష్టపడితే దానంతట అదే మనకు గుర్తింపు లభిస్తుందని ఈమె తెలియజేశారు. ఇలా ఉన్నఫలంగా యామి గౌతమ్ పబ్లిసిటీ కోసమే కొందరు తాపత్రయ పడుతూ ఉంటారంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు అంటూ చర్చలు మొదలయ్యాయి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus