‘శివ పుత్రుడు’ ‘గజిని’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య… ఆ తర్వాత చాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు కానీ విజయాన్ని అయితే సొంతం చేసుకోలేకపోయాడు. ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ ‘వీడోక్కడే’ వంటి చిత్రాలకు మంచి స్పందన లభించింది కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అవి వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఇలాంటి తరుణంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ‘యముడు’. ‘సింగం’ సిరీస్ కు ఫస్ట్ పార్ట్ ఇది. హరి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2010వ సంవత్సరం జూలై 2న విడుదలై ఘన విజయం సాధించింది.తెలుగులో సూర్య క్రేజ్ ను, మార్కెట్ ను పెంచిన చిత్రం ఇది. నేటితో ఈ చిత్రం విడుదలై 11 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
4.35 cr
సీడెడ్
1.13 cr
ఉత్తరాంధ్ర
1.69 cr
ఈస్ట్
0.77 cr
వెస్ట్
0.68 cr
గుంటూరు
0.94 cr
కృష్ణా
0.79 cr
నెల్లూరు
0.47 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
10.82 cr
‘యముడు’ చిత్రాన్ని తెలుగులో రూ.5.8 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.82 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్లకు రూ.5.02 కోట్ల లాభాలు దక్కినట్టు తెలుస్తుంది.