Yash, Jr NTR: ఎన్టీఆర్ తో అనుబంధం గుట్టువిప్పిన యశ్!

పాన్ ఇండియా హీరో యశ్ కు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. కేజీఎఫ్2 సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యశ్ కు టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా మంచి అనుబంధం ఉంది. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన హీరోలలో యశ్ ఒకరు. సీరియళ్ల ద్వారా గుర్తింపును సంపాదించుకున్న యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగారు.

Click Here To Watch Trailer

తాను షూటింగ్ కోసం హైదరాబాద్ కు వస్తే చరణ్ ఇంటి నుంచి భోజనం వస్తుందని యశ్ పేర్కొన్నారు. తాను జూనియర్ ఎన్టీఆర్ తల్లి చేతి వంటను తిన్నానని యశ్ వెల్లడించారు. ఎన్టీఆర్ తనను డిన్నర్ కు ఆహ్వానించగా ఆ సమయంలో తారక్ తల్లి తనకు భోజనం వడ్డించారని యశ్ పేర్కొన్నారు. తారక్ తల్లి కన్నడ మహిళ అని ఆమె ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని యశ్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్, చరణ్ లతో ఉన్న అనుబంధానికి సంబంధించి యశ్ గుట్టు విప్పారు.

ఆర్ఆర్ఆర్ మూవీ క్రియేట్ చేసిన రికార్డులను కేజీఎఫ్2 సినిమా బ్రేక్ చేస్తుందా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది. కేజీఎఫ్2 సినిమా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని యశ్ అభిమానులు భావిస్తున్నారు. కేజీఎఫ్1 సక్సెస్ సాధించినా కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేయడంలో విఫలమైంది. యశ్, ప్రశాంత్ నీల్ సినీ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ ఎంతో కీలకం కానుంది.

కేజీఎఫ్2 సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది. కేజీఎఫ్2 సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం తేలిపోనుంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం దక్కనుందో చూడాల్సి ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus