కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమా ద్వారా ఊహించని స్థాయిలో యశ్ పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో యశ్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్2 థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాను మించి సక్సెస్ సాధిస్తుందని యశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్2 ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన యశ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మైసూరులో ఐదో తరగతి చదువుతున్న సమయంలో టీచర్ పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే హీరోనవుతానని తాను చెప్పానని యశ్ చెప్పుకొచ్చారు.
క్లాస్ లో అందరూ నవ్వినా తన మనసులో లక్ష్యం మాత్రం మారలేదని యశ్ కామెంట్లు చేశారు. సక్సెస్ తనకు తేలికగా దక్కలేదని యశ్ అన్నారు. సక్సెస్ కోసం తాను చాలా కష్టపడ్డానని యశ్ వెల్లడించారు. 15 సంవత్సరాల వయస్సులో 300 రూపాయలు తీసుకుని బెంగళూరు పారిపోయానని యశ్ పేర్కొన్నారు. బెంగళూరుకు వెళ్లాక తనకు భయం వేసిందని నాటకాలు వేసి వచ్చిన డబ్బుతో జీవనం సాగించానని యశ్ వెల్లడించారు. నందగోకుల అనే సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని ఆ తర్వాత ఐదు సీరియళ్లలో ఛాన్స్ రాగా అన్ని సీరియళ్లలో తాను హీరోగా నటించానని యశ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత మొగ్గిన మనసులు అనే మూవీలో ఛాన్స్ దక్కిందని యశ్ వెల్లడించారు. రాకీ చిత్రంలో హీరోగా చేసిన తర్వాత కెరీర్ విషయంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదని యశ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ కు వచ్చిన సమయంలో చాలామంది చరణ్ లా ఉన్నావని అన్నారని యశ్ కామెంట్లు చేశారు. గతంలో తన ఫోటోలు చూస్తే తనకే అలా అనిపించేదని యశ్ అన్నారు.
నా అసలు పేరు నవీన్ కుమార్ గౌడ అని తన నక్షత్రం ప్రకారం య అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలని జ్యోతిష్కులు సూచించడంతో పేరు మార్చుకున్నానని యశ్ వెల్లడించారు. యశ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!