కన్నడ పవర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తుండగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన కింద పడిపోయారు. ఆయన సన్నిహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు.46 ఏళ్ళకే పునీత్ మరణించడంతో ఒక్క కన్నడీలు మాత్రమే కాదు మిగతా సినీ పరిశ్రమలను కూడా ఆ వార్త కుదిపేసింది.
ఇది ఇలా ఉండగా.. మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్బంగా ఆయన నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆ చిత్రం మేకర్స్. కర్ణాటకలోని అన్ని థియేటర్లలోనూ వారం రోజుల పాటు ఈ చిత్రమే ప్రదర్శింపబడింది.ఈ క్రమంలో ఆ చిత్రాన్ని చూడ్డానికి అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చారు. సినిమా అయిపోతున్న సమయంలో వారు కన్నీటి పర్యంతం అయ్యారు. మొత్తానికి పునీత్ చివరి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు ఈ మూవీని ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్రం మేకర్స్. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 14న ‘జేమ్స్’ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ ఈ చిత్రం కన్నడంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం వెర్షన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే అదే రోజున దేశమంతా ఎదురుచూస్తున్న ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో పునీత్ చివరి చిత్రం ‘జేమ్స్’ వల్ల ‘కె.జి.ఎఫ్2’ కలెక్షన్ల పై ప్రభావం పడుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఏమవుతుందో..!
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?