Yash, Tamanna: యశ్, తమన్నాల జోడీ కుదరడం సాధ్యమేనా..?

  • June 19, 2021 / 04:09 PM IST

తెలుగులో ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తెలుగులో ఎఫ్3, సీటీమార్ సినిమాలతో పాటు గుర్తుందా శీతాకాలం సినిమాలలో తమన్నా నటిస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా తమన్నాకు స్టార్ హీరో యశ్ కు జోడీగా నటించే ఛాన్స్ దక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండటం గమనార్హం. తమన్నాకు అవకాశాలు తగ్గుతున్న తరుణంలో యశ్ కు జోడీగా ఛాన్స్ అంటే ఆమె కెరీర్ కు ఈ అవకాశం ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే యశ్ అభిమానులు మాత్రం తమన్నాకు బదులుగా మరో హీరోయిన్ ను ఈ సినిమాలో ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యశ్ నటించిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా కేజీఎఫ్ 2 త్వరలో రిలీజ్ కానుంది. దర్శకుడు నార్తన్ డైరెక్షన్లో యశ్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నాకు సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా మంచి గుర్తింపు ఉంది.

తమన్నా పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాకే ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో యశ్ యంగ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. యశ్ సినిమాలో ఛాన్స్ అంటే తమన్నా నో చెప్పే అవకాశమే లేదు. కేజీఎఫ్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేశారు. యశ్ తరువాత మూవీలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైతే ఇతర కన్నడ సినిమాల్లో కూడా తమన్నాకు ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus