Yashoda Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘యశోద’.!

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.అయితే వీక్ డేస్ లో డౌన్ అయ్యింది.కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ తగ్గాయి.అయితే రెండో వీకెండ్ కు మళ్ళీ కోలుకుంది. నిన్నటితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు ఆల్మోస్ట్ క్లోజ్ గా వచ్చింది. ఆదివారం రోజుతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకసారి ‘యశోద’ ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  3.56 cr
సీడెడ్  0.64 cr
ఉత్తరాంధ్ర  0.89 cr
ఈస్ట్  0.43 cr
వెస్ట్  0.26 cr
గుంటూరు  0.45 cr
కృష్ణా  0.48 cr
నెల్లూరు  0.22 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  6.93 cr
తమిళనాడు  0.95 cr
హిందీ  0.53 cr
ఓవర్సీస్  2.52 cr
రెస్ట్  0.56 cr
టోటల్ వరల్డ్ వైడ్  11.49 cr  (షేర్)

‘యశోద’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల సమాచారం. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.11.49 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10వ రోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus