Yatra2: వైఎస్‌ జగన్‌ ప్రచార సినిమా అప్‌డేట్‌… టైమ్‌ దగ్గరపడిందంటున్న పార్టీ వర్గాలు!

రాజకీయాలకు సినిమాలు ఉపయోగపడతాయా? ఈ ప్రశ్న మనం చాలా రోజుల నుండి వింటూనే ఉన్నాం. దీనికి సరైన సమాధానం చెప్పడం అన్నివేళలా సాధ్యం కాదు కానీ.. చాలావరకు ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. సినిమాల్లో చెప్పింది ప్రజలు గుర్తు పెట్టుకుని వాటిని ఓట్లు వేసేటప్పుడు మనసులో పెట్టుకుంటారు అని అనుకుంటూ ఉంటారు. ఈ నమ్మకంతోనే ప్రతిసారి ఎన్నికలప్పుడు అప్పటి రాజకీయాల్ని ప్రభావితం చేసేలా ఓ సినిమా వస్తుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అందులో భాగంగానే ‘యాత్ర 2’ కూడా రానుంది అని చెబుతున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ అనే సినిమా తెరకెక్కించింది. ఆయన యాత్రలో చేసిన పనులు, మాట్లాడిన విషయాలు, సినిమాటిక్‌ సీన్స్‌ కలబోతగా దర్శకుడు మహి వి. రాఘవ్ తెరకెక్కించారు. ఆ సినిమాలో రాజశేఖర్‌ రెడ్డిగా మమ్ముట్టి అదరగొట్టారు. దానికి సీక్వెల్‌గా ‘యాత్ర 2’ వస్తుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా ప్రారంభానికి సమయం దగ్గరపడింది అంటున్నారు. వైఎస్‌ సన్నిహితులకు మంచి రోజునాడు ఈ సినిమా ముహూర్తం ఉంటుందట

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంగా ఆధారంగా తీయబోయే (Yatra2) ‘యాత్ర 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. జగన్ పాదయాత్రను ఈ సినిమాలో చూపించబోతున్నారట. తండ్రి మరణం నుండి తనయుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడానికి మధ్య ఏం జరిగింది అనేది ఈ సినిమా కథాంశమట. జులై 8 అంటే వైఎస్‌ జయంతి నాడు ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట. ఇందులో జగన్‌ మోహన్‌ రెడ్డిగా తమిళ హీరో జీవా నటిస్తాడని టాక్‌.

అయితే ‘రంగం’ నటుడు అజ్మల్, ‘స్కామ్ 1992’ నటుడు ప్రతీక్ గాంధీ, దుల్కర్‌ సల్మాన్ తదిరుల పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి. మరి వీరిలో ఎవరిని ఓకే చేస్తారో చూడాలి. ఇక ఆంధ్రలో ఎన్నికలకు ముందు ‘యాత్ర 2’ సినిమాను విడుదల చేయాలని టీమ్‌ అనుకుంటోందట. అయితే ఈ సినిమా వస్తే మాత్రం ఏపీలో రాజకీయ ప్రకంపనలు పక్కాగా ఉంటాయి అని పరిశీలకుల అంచనా. మరి ఏం చేస్తారో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus