ఒక్క కట్ కూడా లేకుండా ‘యాత్ర’ సెన్సార్ పూర్తయ్యింది..!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘యాత్ర’. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ‘వైఎస్ఆర్’ పాత్రలో… వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మెయిన్ పాయింట్ గా… మహి వి రాఘవ్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. బయోపిక్ కావడంతో… ఈ చిత్రానికి సెన్సార్ అంత సులువుగా జరగదని, చాలా ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించేలా ‘యూ’ సర్టిఫికెట్ రావడం పై ఇటు సోషల్ మీడియాలోనూ.. అటు ఫిలింనగర్లోనూ చర్చ మొదలయ్యింది.

ఇక ఈ చిత్రం చాలా బాగుందని సెన్సార్ బోర్డు సభ్యులు పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు మెంబర్స్ ప్రత్యేకంగా చిత్ర యూనిట్ ను అభినందించారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రంలో వైఎస్ పాత్రను మమ్ముట్టి అద్భుతంగా చేసారంట… రావు రమేష్ సహాయ పాత్ర కూడా చాలా బాగా వచ్చిందట. ఈ చిత్రంలో డైలాగులు చాలా బాగున్నాయట. సుహాసిని, జగపతి బాబు పత్రాలు కూడా చాలా బాగా వచ్చాయట. ఈ చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 6 నిమిషాలే కావడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ‘భలే మంచిరోజు’ ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించినట్టు.. నిర్మాణ విలువలు చెబుతున్నాయి.

‘ఆనందో బ్రహ్మ’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ ఈ చిత్రాన్ని కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారట. పాటలకు పెద్ద ప్రాధాన్యత లేకపోవడం… డైరెక్టర్ గత చిత్రంలో మాదిరి ఈ చిత్రంలో కామెడీ ఉండకపోవడం వంటివి కొన్ని మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 8న ఇది విడుదల కాబోతుంది. చాలా కాలం తరువాత మమ్ముట్టి నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడంతో ఈ చిత్రం పై క్రేజ్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లతో అది స్పష్టం అవుతుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus