బిగ్ బాస్ హౌస్ లో ఎవిక్షన్ ఫ్రీపాస్ టాస్క్ అనేది దుమ్మురేపిందనే చెప్పాలి. వరుస పెట్టి మరీ టాస్క్ లు ఒకేరోజు టెలికాస్ట్ చేసేశాడు బిగ్ బాస్. ఈ పాస్ అయితే యావర్ నిలబెట్టుకున్నాడు. గెలుచుకున్నాడు. మరి దీన్ని ఎవరికోసం వాడతాడు అనేది ఆసక్తికరం. ఫస్ట్ ఛాలెంజ్ షేక్ బేబీ షేక్ టాస్క్ లో యావర్ చీట్ చేసినట్లుగా హౌస్ మేట్స్ అభిప్రాయ పడ్డారు. ఫ్లాట్ ఫార్మ్ పైన బ్యాలన్స్ చేసేటపుడు యావర్ కాళ్లు కిందపెట్టి బంతిని ముట్టుకున్నాడని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఈ ఫోటోలో క్లియర్ గా అది అర్దం అవుతోంది.
నిజానికి బాస్కెట్ లో తొమ్మిది బాల్స్ మాత్రమే ఉన్నాయి. ఆఖరి బంతికోసం గొడవ జరుగుతుందని బిగ్ బాస్ ఎక్స్ పెక్ట్ చేశాడు. కానీ, యావర్ ముందుగా వచ్చి బంతిని తీస్కుని స్లాట్ లో పెట్టేశాడు. దీంతో సంచాలక్ అయిన అమర్ దీప్ యావర్ ని విన్నర్ గా డిక్లేర్ చేశాడు. యావర్ కాళ్లు రెండు కింద పెట్టి మరీ బంతిని స్లాట్ లో బ్యాలన్స్ చేశాడు. దీంతో యావర్ చీట్ చేశాడని హౌస్ మేట్స్ చర్చలు మొదలుపెట్టారు. ఈవిషయం శివాజీ చూసి కూడా అక్కడ చెప్పలేదు.
యావర్ వచ్చి అడిగితే ఏమో నేను బాల్స్ ని చూస్తున్నాను నిన్ను గమనించలేదని చెప్పాడు. మరోవైపు అమర్ దీప్ సంచాలక్ గా ఫైయిల్ అయ్యానా అంటూ అందరినీ అడిగాడు. ముఖ్యంగా గౌతమ్ అక్కడ చాలా క్లారిటీగా స్మోకింగ్ జోన్ లో అమర్ కి ఎక్స్ ప్లైన్ చేశాడు. ఇక ఈ టాస్క్ తర్వాత అర్జున్ ఓడిపోవడం బెటర్ అన్నాడు. ఆ పాస్ ఉన్నకొద్దీ నెత్తిమీద బండలాంటిందన్నాడు. శివాజీ అయితే డైరెక్ట్ జనాల్లోకి పోవడమే అంటూ ముక్తాయింపు ఇచ్చాడు. ఇక్కడే అశ్విని స్టార్ మా బ్యాచ్ లో ఒకరైనా ఈవారం ఎలిమినేట్ అయితే బాగుండు.
అప్పుడు అసలు సిసలైన ఆట బయటకి వస్తుందని చెప్పింది. రతిక తన గేమ్ గురించి ఓవర్ కాన్పిడెన్స్ వద్దని యావర్ చెప్పాడని, అప్పట్నుంచీ ఎందుకో నాతో మాట్లాడటం లేదని అర్జున్ తో చెప్పుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ స్కూటర్ పై సవారీ టాస్క్ పెట్టాడు. ఇంటిలో ప్లాస్మా లో వచ్చే నెంబర్ ని చూసుకుని బయట గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన స్కూటర్ పై ఆ నెంబర్ వచ్చేవిధంగా పెట్టాలి. అక్కడ స్టాండ్ కి చాలా నెంబర్స్ పేర్చి ఉన్నాయి. అందులో మన నెంబర్ ని వెతికి పట్టుకోవాలి. దీనికోసం యావర్ ప్రశాంత్ ని ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు.
ఈ టాస్క్ లో కూడా యావర్ విన్నర్ గా నిలిచాడు. ఇందులో జెన్యూన్ గా ఆడాడు. మొత్తం మూడు రౌండ్స్ గా జరిగిన ఈ టాస్క్ మొదటి రెండు రౌండ్స్ యావర్ గెలివగా, లాస్ట్ రౌండ్ లో ప్రశాంత్ గెలిచాడు. దీనికి సంచాలక్ గా గౌతమ్ ఉన్నాడు. ఆ తర్వాత హౌస్ లో చిన్న పిల్లల టాస్క్ వచ్చింది. ఉడతా ఉడతా ఊచ్ గుర్తుచేశాడు బిగ్ బాస్. చిల్డ్రన్స్ డే సందర్భంగా హౌస్ మేట్స్ కాసేపు ఫన్ చేశారు. అంతేకాదు, హౌస్ లోకి చాక్లెట్స్, బిస్కెట్స్, బర్గర్స్ పంపించాడు బిగ్ బాస్. దీంతో శోబాశెట్టి బర్గర్ ని లాగించేసింది.
ఆ తర్వాత ఇదే బర్గర్ టాస్క్ పెట్టాడు (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో డైస్ ని ఏర్పాటు చేసి దానిని ఐ లవ్ బర్గర్ అని వచ్చేలా వేసి ఒక్కొక్క బర్గర్ ని తినాలి. ఈ ఛాలెంజ్ లో యావర్ శోభాశెట్టిని ప్రత్యర్థింగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఇద్దరూ పోటాపోటీగా బర్గర్స్ తిన్నారు. కానీ , శోభాశెట్టి డైస్ త్వరగా వేయడంలో విఫలం అయ్యింది. అందుకే, టాస్క్ ఓడిపోయింది. నెక్ట్స్ టాస్క్ లో అసలు మజా వచ్చింది. ప్రియాంక – శివాజీ – యావర్ విల్లుని ఎక్కుపెట్టి బాల్ ని బాలన్స్ చేయాలి. ఇక్కడే చాలాసేపు యావర్ బాల్స్ ని చేతిలో పెట్టుకున్నాడు టైమ్ పాస్ చేశాడు.
అలాగే, శివాజీ కూడా బాల్ ని చేతులతో హోల్ట్ చేశారు. ఫస్ట్ బాల్ అప్పుడు బానే ఆడారు కానీ, సెకండ్ బాల్ అప్పుడు మాత్రం ప్రియాంక చాలా బాగా ఆడింది. కానీ థర్డ్ బాల్ కి అవుట్ అయిపోియంది. ఇక్కడే శివాజీ ఫ్రస్టేట్ అయ్యాడు. నిజానికి అక్కడ జెన్యూన్ గా శివాజీ అవుట్ అయ్యాడు. కానీ ఫ్రస్టేషన్ లో ప్రశాంత్ ని మాట్లాడుతునే ఉన్నావ్ అంటూ విసుక్కుని వెళ్లిపోయాడు. ఈ టాస్క్ తర్వాత శోబాశెట్టికి ఇంకా శివాజీకి పెద్ద ఆర్గ్యూమెంట్ అయ్యింది. ఈ టాస్క్ లో యావర్ గెలిచి ఎవిక్షన్ ఫ్రీపాస్ ని సొంతం చేస్కున్నాడు. మరి దీన్ని ఎవరికోసం వాడతాడు అనేది ఆసక్తికరం.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!