Bigg Boss 7 Telugu: ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏంటి ? అతడ్ని కావాలని పంపించేస్తున్నారా ?

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం అంటే 13వ వారం ఎలిమినేషన్ అనేది రసవత్తరంగా మారింది. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఒకలాగా, యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ లో ఇంకోలాగా ఓటింగ్ అనేది పోల్ అవుతోంది. ఈసారి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అయితే ఇంటి నుంచీ వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ అఫీషియల్ పోలింగ్ చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ కి అందరికంటే కూడా ఎక్కువగా ఓటింగ్ జరుగుతోంది. ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా విన్నింగ్ రేస్ లో ముందుంటాడు పల్లవి ప్రశాంత్. ఇక తర్వాత శివాజీ ఓటింగ్ కూడా చాలా మెరుగ్గా ఉంది.

లాస్ట్ వీక్ కంటే కూడా ఈవారం చాలాబాగా ఓటింగ్ అనేది జరుగుతోంది. వీరిద్దరూ అయితే ఈవారం సేఫ్ గానే ఉన్నారు. ఇక ఐదుగురు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పాలి. ఇందులో యావర్ , ఇంకా అర్జున్ అయితే కొద్దిగా సేఫ్ లోనే కనిపిస్తున్నారు. అమ్మాయిలు అయిన ప్రియాంక – శోభా ఇద్దరూ కూడా బోటమ్ లో ఉన్నారు. కానీ, ఫినాలే దగ్గరికి వస్తున్న నేపథ్యంలో అమ్మాయిలని ఈసారి హౌస్ నుంచీ పంపించకపోవచ్చు. అయితే, అబ్బాయిలలోనే ఎలిమినేషన్ అనేది చేసే అవకాశం ఉంది. కాబట్టి అర్జున్ – యావర్ – ఇంకా గౌతమ్ ఈ ముగ్గురిలోనే ఎలిమినేషన్ అనేది ఉండచ్చని అంటున్నారు.

పల్లవి ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉంది కాబట్టి, యావర్ డేంజర్ జోన్ లోకి వెళితే ఖచ్చితంగా పాస్ ని తనకోసం వాడతాడు. లేదంటే మాత్రం తను చివరి వరకూ సేఫ్ అవ్వకుండా ఉన్నా కూడా పల్లవి ప్రశాంత్ పాస్ ని తనకోసం వాడుకుంటాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండకుండా ఉంటే తను సేఫ్ అవుతాడు. లేదంటే బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పల్లవి ప్రశాంత్ యావర్ కి పాస్ వాడితే యావర్ ఈవారం సేఫ్ అవుతాడు. అప్పుడు అర్జున్ ఇంకా గౌతమ్ ఇద్దరిలోనే ఎలిమినేషన్ అనేది ఉండచ్చు.

వీరిద్దరూ ఎలిమినేషన్ లో ఉంటే అర్జున్ కొద్దిగా బెటర్ పొజీషన్ లో ఉన్నాడు కాబట్టి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు. ఒకవేళ గౌతమ్ ని ముందుగానే సేఫ్ చేస్తే అర్జున్ – ప్రియాంకలని లాస్ట్ వరకూ ఉంచుతారు. వారిద్దరిలో అప్పుడు అర్జున్ ని ఇంటికి పంపించేస్తారు. లేదు , అన్ అఫీషియల్ లో బోటమ్ లో ఉన్నవారినే పంపించేయాలని అనుకుంటే శోభా శెట్టి ఇంకా ప్రియాంక ఇద్దరిలో ఒకరు ఎలిమిేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈసారి (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్ ఖచ్చితంగా షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడనే అనిపిస్తోంది. అదీ మేటర్.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus