Hamsa Nandini: క్యాన్సర్ ను జయించి షూటింగ్ లో పాల్గొంటున్న హంస నందిని… వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

‘బిగ్ బాస్2’ ఫేమ్ కౌశల్…. హీరోగా రూపొందిన ‘ఒకటవుదాం’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. ఆ తరువాత ‘786’ అనే చిత్రంలో కూడా నటించింది. కానీ వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అనుమానాస్పదం’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.! అటు తరువాత ‘అధినేత’ ‘ఆహా నా పెళ్లంట’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ హీరోయిన్ గా మాత్రం ఈమె నిలబడలేకపోయింది. దీంతో స్పెషల్ సాంగ్ లు, గెస్ట్ రోల్స్ కు మాత్రమే పరిమితమయ్యింది.

ఇదిలా ఉండగా…. హంసా నందిని ఆ తర్వాత క్యాన్సర్ భారిన పడిన సంగతి తెలిసిందే. బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్లు.. కీమో థెరపీ తర్వాత మందులు వాడి కొలుకున్నట్టు తెలుస్తుంది. ఏడాదిన్నర పాటు ఈమె క్యాన్సర్ తో పోరాడి గెలిచినట్టే కనిపిస్తుంది. హంసా నందిని ఇప్పుడు కోలుకోవడంతో ఇప్పుడు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా హంస ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus