Yemunnave Pilla Song: ‘నల్లమల’ ట్రెండింగ్‌ సాంగ్‌ గురించి ఈ వివరాలు తెలుసా?

  • October 4, 2021 / 08:10 AM IST

ఈ మధ్య యూట్యూబ్‌లో, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌లో… ఇలా ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తున్న పాటల్లో ‘ఏమున్నావే పిల్ల ఏమున్నావే’ ఒకటి. ‘నల్లమల’ సినిమాలోని గీతమిది. ఈ పాటకు ఇప్పటికే యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్‌ వచ్చేశాయి. దీనిని రాసింది, బాణీ కట్టింది పీఆర్‌. మరి ఈ పాట కోసం ఆయనేం చేశారు, అసలు ఈ పాటలో ఉన్న పదాల అమరిక సంగతేంటి, పాటను ఎలా రాశారో చూద్దాం!

‘ఏమున్నావే ’ పాటను ఇప్పటికే మీరు వినుంటారు, ఒకవేళ వినకపోతే ఓసారి వినేసిరండి. అప్పుడు ఈ డీకోడ్‌ బాగా అర్థమవుతుంది. అమ్మాయి రంగుని పాలతో పోల్చడం, సొగసుని పూలతో వర్ణించడం… లాంటివి మనం చాలా సినిమా పాటల్లో విన్నాం. అయితే ఈ పాటలో అంతకుమించిన పదాలు, వివరణ కనిపిస్తాయి. అవే ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి మేని రంగు పాలకన్నా తెల్లగా ఉంది… అని చెబుతూనే అడివంచు పల్లెలోని ‘లేత లేగదూడపిల్ల తాగే… పొదుగులోని పాలు’ అని డబుల్‌ ఫ్లేవర్‌ యాడ్‌ చేశారు పీఆర్‌.

ఆ అమ్మాయిది పువ్వు లాంటి సొగసు… దీన్ని ‘తేనెటీగలన్నీ సుట్టుముట్టేలా’ ఉన్నాయి అంటూ వివరణ ఇచ్చారు రచయిత. ఆ వెన్నెల నవ్వుని… ఇంకా అందంగా చెప్పేలా దట్టమైన అడవిని కమ్ముకున్న ‘కారుమబ్బు సీకట్లో…’ కనిపిస్తున్నట్టు రాశారు. చంద్రుడూ సిగ్గుపడి మబ్బెనక దాక్కున్నాడు అంటూ… చాలామంది అమ్మాయి అందాన్ని వివరించి రాశారు. ఈ పాటలో ‘సూరీడు సూడు పొద్దుదాటినా నిన్ను సూసి పోలేడే’ అని కొత్తగా రాశారు రచయిత. ఇదీ పాట లెక్క.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus