అక్కడ మనకోసం రెడ్ కార్పెట్ పరిచి ఉండదు – నాగచైతన్య

‘దోచేయ్’ తర్వాత నాగచైతన్య నుండి మరో సినిమా రాలేదు. అలా అని అతడు ఖాళీగా ఉన్నాడంటే అదీ లేదు. యువ హీరోల్లో ఫుల్ బిజీగా వున్నా వారి చైతు ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ, సురేష్ ప్రొడక్షన్స్, ఇంద్రగంటి మోహనకృష్ణ వంటి వారితో సినిమాలు క్యూ పెట్టాడు నాగచైతన్య. శింబు పుణ్యమా అని ”సాహసం శ్వాసగా సాగిపో’ వాయిదా పడింది. కానీ ఆ సినిమాతో సంబంధం లేకుండా ‘ప్రేమమ్’ ని దసరాకి సిద్ధం చేస్తున్నాడు చైతు. ఇదిలా ఉంటే తమిళ దర్శకులతో సినిమా చేస్తున్న మీరు కోలీవుడ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు ఈ అక్కినేని వారసుడు.

“తమిళ చిత్ర పరిశ్రమ మార్కెట్ తక్కువేం కాదు. పైగా అక్కడ ప్రతిభ గల వల్ల లెక్క ఎక్కువే. అందరిని దాటి వెళ్లాలంటే దానికి సరిపడా కథ ఉండాలి. మనం వెళదాం అనుకోగానే అక్కడ రెడ్ కార్పెట్ పరిచి ఉంచరు” అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు నాగచైతన్య. చైతూ చెప్పింది అక్షర సత్యం. తమిళంలో కమర్షియల్ సినిమాలతో సమాంతరంగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి. ఆ లెక్కన అక్కడ అన్ని రకాల వారు ఉన్నారు. సూర్య, విక్రమ్ ల మాదిరి మన టాలీవుడ్ హీరోలు అక్కడ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. సీనియర్ హీరో అయినా నాగ్ ‘ఊపిరి’ సినిమాతో తంబీల ముందుకు వెళ్లారంటే కార్తీ ఉండబట్టే. ఇప్పుడు మహేశ్ ధైర్యం కూడా మురుగదాస్ ని చూసే.

https://www.youtube.com/watch?v=R1nBw8EbOmI

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus