ఈ టాలెంటెడ్ హీరోల సక్సెస్ మంత్ర ఏంటో మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలామంది హీరోలు రెండేళ్లకు మూడేళ్లకు ఒక సినిమాలో నటిస్తున్నారు. మిడిల్ రేంజ్ హీరోలు వేగంగానే సినిమాల్లో నటిస్తున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అయితే దక్కడం లేదు. అయితే చాలామంది యంగ్ హీరోలు మాత్రం తక్కువ పారితోషికం తీసుకుంటూ భారీ విజయాలను సొంతం చేసుకుంటూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వచ్చేలా చేస్తున్నారు. సరైన కథ, కథనం ఉన్న సినిమాలను ఎంచుకోవడమే ఈ యంగ్ హీరోల సక్సెస్ సీక్రెట్ అని చెప్పవచ్చు.

డీజే టిల్లు (DJ Tillu) , టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలతో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) యూత్ ను ఆకట్టుకున్నారు. వరుస విజయాలతో సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్ మారిపోయిందని చెప్పవచ్చు. తన సినిమాలకు తనే కథ రాసుకుంటూ సిద్ధు జొన్నలగడ్డ సక్సెస్ సాధించారు. యంగ్ హీరో తేజ సజ్జాకు (Teja Sajja) కూడా వరుస విజయాలు దక్కుతున్నాయి. జాంబిరెడ్డి (Zombie Reddy) , హనుమాన్ (Hanu Man) సినిమాల విజయాలతో తేజ సజ్జా కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రస్తుతం మిరాయ్ (Mirai) సినిమాలో సూపర్ యోధుడిగా తేజ సజ్జా కనిపించనున్నారు. మరో టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) క్షణం (Kshanam) , గూఢచారి (Goodachari) , ఎవరు (Evaru) , హిట్2 (HIT2) , మేజర్ (Major) సినిమాలతో విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం గూఢచారి సీక్వెల్, డెకాయిట్ సినిమాలలో శేష్ నటిస్తున్నారు. నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తనకు మాత్రమే సొంతమైన కామెడీ టైమింగ్ తో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. జాతిరత్నాలు (Jathi Ratnalu) సక్సెస్ తర్వాత నవీన్ కెరీర్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

మరో యంగ్, టాలెంటెడ్ హీరో సుహాస్ (Suhas) కూడా వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. ఈ హీరోల సక్సెస్ రేట్ అంతకంతకూ పెరగడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ టాలీవుడ్ హీరోల రేంజ్ రాబోయే రోజుల్లో ఎంతో పెరగాలని ఇతర భాషల్లో సైతం ఈ హీరోలు సత్తా చాటాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus