Guntur Kaaram: ఆ కారణంతోనే గుంటూరు కారం నుండీ నేను కూడా తప్పుకోవాల్సి వచ్చింది: యంగ్ హీరో

మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పై ఎస్.రాధా కృష్ణ ( చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ గ్లింప్స్ విడుదల అయ్యింది.దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉండగా.. ఈ ప్రాజెక్టు లో ఊహించని విధంగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట మెయిన్ హీరోయిన్ గా ఎంపికైన పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది.

దీంతో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయ్యింది. ఇక సెకండ్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ వంటి వారిని పరిశీలించి మీనాక్షి చౌదరిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా .. ఈ చిత్రంలో సెకండ్ హీరోగా మొదట యంగ్ హీరో సాయి రోనాక్ ని కూడా ఎంపిక చేసుకున్నారు. కానీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఈ యంగ్ హీరోనే ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసుకోవడం జరిగింది.

అయితే ఇప్పుడు ఇతను కూడా (Guntur Kaaram) ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడట. ఈ యంగ్ హీరోనే ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇతను ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత .. స్క్రిప్ట్ లో మార్పులు చోటు చేసుకున్నాయట. దీంతో ఇతని పాత్రని కూడా త్రివిక్రమ్ మార్చడం జరిగిందట. ఈ క్రమంలో హీరోగా చేస్తున్న ఇతని కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమో అని త్రివిక్రమ్ .. ఇతన్ని లైట్ తీసుకోమని చెప్పినట్టు ఇతను తెలిపాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus