Krithi Shetty: కృతి శెట్టి కి భారీ ఆఫర్ ఇచ్చిన హీరో విశాల్!

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి శెట్టి అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ భాషలలో విపరీతమైన సంపాదించుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఉప్పెన సినిమా తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న కృతి శెట్టి ప్రస్తుతం రామ్ సరసన దివారియర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఈనెల 14వ తేదీ విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా అనంతరం ఈమె సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటించారు. అలాగే మరోసారి నాగచైతన్య సరసన నటించడానికి సిద్ధమైంది. అదేవిధంగా తమిళ డైరెక్టర్ బాల దర్శకత్వంలో హీరో సూర్య సరసన నటించడానికి ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కృతి శెట్టి కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ భాషలలో ఎన్నో మాస్ యాక్షన్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న విశాల్ కృతి శెట్టి కోసం వెయిట్ చేస్తున్నారట.

విశాల్ తన తదుపరి సినిమాలో కృతి శెట్టికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈమెకు డేట్స్ అడ్జస్ట్ కాక సతమతమవడంతో ఈమె పరిస్థితిని అర్థం చేసుకున్న విశాల్ తనకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మీకు సమయం ఉన్నప్పుడే డేట్స్ ఇస్తే సరిపోతుందని విశాల్ కృతి శెట్టికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా తనకు ఆఫర్ ఇవ్వడమే కాకుండా కొన్ని రోజులు ఇతర సినిమాలలోను కొన్ని రోజులు తన సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేసుకున్న తమకేమీ అభ్యంతరం లేదని విశాల్ సూచించారట.

ఈ విధంగా హీరోయిన్ కోసం చిత్ర బృందం మొత్తం ఇలా అడ్జస్ట్ కావడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా తెలుగు తమిళ భాషలలో బేబమ్మ క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతుంది.ఇకపోతే ఈమె రామ్ సరసన నటించిన దివారియర్ సినిమా ద్వారా త్వరలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus