Jr NTR: కొరటాల మూవీపై క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీకి సంబంధించి ఫిబ్రవరి నెలలోనే పూజా కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల పూజా కార్యక్రమాలు జరగలేదు. ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా ఎంపిక కాగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. అయితే ఈ విషయాలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా తారక్ తన తరువాత సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు.

Click Here To Watch NOW

కొరటాల శివ సినిమా కొరకు బరువు తగ్గుతున్నానని ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తానని తారక్ వెల్లడించారు. జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తారక్ పేర్కొన్నారు. గతంలో కొన్ని సినిమాల్లో స్లిమ్ లుక్ లో కనిపించిన తారక్ ఈ సినిమాలో కూడా అలా కనిపించబోతున్నారని బోగట్టా. కొరటాల శివ మూవీలో తన లుక్ కొత్తగా ఉంటుందని ఆడియన్స్ సైతం తన లుక్ ను చూసి ఆశ్చర్యపోతారని తారక్ పేర్కొన్నారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తారక్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నారు. ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పుర్తి చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. కొరటాల శివ సైతం ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులకు నచ్చే సందేశం కూడా ఉండనుందని సమాచారం. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీతో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. అలియా భట్ ఈ సినిమా కోసం 15 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus