Jr NTR, Prashanth Neel: తారక్ ప్రశాంత్ మూవీకి ఆ హీరోయినే కావాలట!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడు ఎవరనే ప్రశ్నకు ప్రశాంత్ నీల్ పేరు జవాబుగా వినిపిస్తోంది. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు కాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన కేజీఎఫ్2 బడ్జెట్ కు రెట్టింపు కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కేజీఎఫ్2 అంచనాలకు మించి కలెక్షన్లను సాధించింది.

కేజీఎఫ్2 సినిమా సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న హీరోల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రశాంత్ నీల్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లు మినహా మరే కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పలేదు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్, ఎన్టీఆర్ తో ఒక సినిమా, యశ్ తో కేజీఎఫ్3 సినిమాలను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా కన్నడ బ్యూటీ అయిన శ్రీనిధి శెట్టిని ఎంపిక చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ శ్రీనిధి జోడీ బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కేజీఎఫ్ సినిమాతోనే ప్రయాణం మొదలుపెట్టింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఛాన్స్ అంటే శ్రీనిధి నో చెప్పే ఛాన్స్ అయితే ఉండదు.

అదే సమయంలో ఎన్టీఆర్ కు కన్నడలో ఉండే పాపులారిటీ అంతాఇంతా కాదు. అక్కడి స్ట్రెయిట్ హీరోలకు సమానంగా జూనియర్ ఎన్టీఆర్ కు క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ అంటే శ్రీనిధి కూడా ఓకే చెబుతోంది. మరి ప్రశాంత్ నీల్ ఈ కాంబోపై దృష్టి పెడతారో లేదో చూడాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus