వైవిఎస్ చౌదరి (YVS Chowdary) భార్య గీత కూడా పలు సినిమాల్లో నటించింది అనే సంగతి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఇది నిజం.1996 లో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘నిన్నే పెళ్లాడతా’లో హీరో చెల్లెలు పాత్ర పోషించారు గీత యలమంచిలి. దానికి కృష్ణవంశీ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. తర్వాత 1997 లో ఆయన బ్రహ్మాజీ, రవితేజ..లతో తీసిన ‘సింధూరం’ సినిమాలో కూడా ఈమె లక్ష్మీ అనే నక్సలైట్ పాత్ర పోషించింది.
ఈ సినిమాలో రవితేజని (Ravi Teja) ప్రేమించే అమ్మాయిగా ఆమె కనిపించింది. టైటిల్ క్రెడిట్స్ లో మాత్రం ఆమె పేరు సౌందర్య అని పడుతుంది. ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా టైంలో వైవిఎస్ చౌదరి, గీతా కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఈ సినిమా షూటింగ్ టైంలోనే వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది.
వైవిఎస్ చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక గీత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అందువల్ల వీరి వివాహానికి పెద్దలు మొదట అంగీకరించలేదు. తర్వాత ఒప్పించి వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత గీత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఇక ప్రస్తుతం దివంగత జానకిరామ్ కొడుకు, దివంగత హరికృష్ణ మనవడు అయినటువంటి నందమూరి తారక రామారావు డెబ్యూ మూవీని తెరకెక్కిస్తున్నారు వైవిఎస్ చౌదరి (YVS Chowdary). ఈ సినిమాని ‘న్యూ టాలెంట్ రోర్స్’ అనే బ్యానర్ పై గీత నిర్మిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.