‘జాంబీ రెడ్డి’ 4 డేస్ కలెక్షన్స్..!

‘యాపిల్ ట్రీస్ స్టూడియోస్’ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మాతగా ‘అ!’ ‘కల్కి’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జాంబీ రెడ్డి’. తేజ సజ్జ, ఆనంది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలయ్యింది. మొదటి షో నుండే ఈ చిత్రానికి డీసెంట్ టాక్ రావడంతో…. మంచి ఓపెనింగ్స్ నే సాధించింది. ముఖ్యంగా మొదటి రోజు కంటే కూడా మూడవ రోజున ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం.. సోమవారం రోజున కూడా అదే జోరుని చూపించింది.

ఇక ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను ఓసారి గమనిస్తే :

నైజాం 1.40 cr
సీడెడ్ 0.83 cr
ఉత్తరాంధ్ర 0.49 cr
ఈస్ట్ 0.35 cr
వెస్ట్ 0.29 cr
కృష్ణా 0.37 cr
గుంటూరు 0.39 cr
నెల్లూరు 0.24 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 4.36 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.16 cr
ఓవర్సీస్ 0.22 cr
టోటల్ వరల్డ్ వైడ్ 4.74 cr (షేర్)

‘జాంబీ రెడ్డి’ చిత్రానికి 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవడానికి 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 4.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మరో 0.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం ఈ చిత్రం 0.89కోట్ల షేర్ ను రాబట్టి బాగానే క్యాష్ చేసుకుంది . మరి వీక్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..!

Click Here To Read Movie Review

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus