కొన్ని సినిమాలు హిట్ అవుతాయని అస్సలు ఊహించము.అలాంటివి కొన్ని బ్లాక్ బస్టర్లు అయ్యి భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ‘జాతి రత్నాలు’ కూడా అలాంటి సినిమాల్లో ఒకటి. ఆ సినిమా కరోనా సెకండ్ వేవ్ కు ముందు వచ్చి భారీ లాభాలను బయ్యర్స్ కు అందించింది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఊపు ఉండగానే శివ కార్తికేయన్ వంటి తమిళ స్టార్ హీరోతో సినిమాని ఓకే చేసేసుకున్నాడు. అదే ప్రిన్స్. ట్రైలర్ బాగానే అనిపించింది. కాకపోతే ఈరోజు రిలీజ్ అయిన ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంది. ఈరోజు 4 సినిమాలు రిలీజ్ అయితే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1)’జాతి రత్నాలు’ సినిమా హిట్ అయ్యింది అంటే అందులో కామెడీ వర్కౌట్ వల్లనే కాదు. అందులో నటించిన నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి వారి నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. వారి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. అయితే ప్రిన్స్ లో మొత్తం అరవం బ్యాచ్ ఉన్నారు. అనుదీప్ రైటింగ్ కు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. శివ కార్తికేయన్ మాత్రం ఓకే అనిపించాడు.
2) ఇక అనుదీప్ కూడా గొప్పగా కామెడీ ట్రాక్ లు రాయలేదు.ఇతను అనిల్ రావిపూడి, మారుతి ల కంటే కూడా కుళ్ళు జోకులు పేల్చాలని చూశాడు. కాకపోతే బాగా పేలాల్సిన కొన్ని వన్ లైనర్స్ కూడా ఆ అరవ క్యాస్టింగ్ వల్ల వేస్ట్ అయిపోయాయి.
3)కథ కూడా ట్రైలర్ లో చెప్పినట్టు గతంలో చాలా సార్లు చూసిందే. కానీ ఇంత పేలవమైన టేకింగ్ తో చూడడం ఇదే మొదటి సారి.
4) అన్ని సినిమాల కథలు బాగుంటాయి అని చెప్పడం తప్పు. కథనం పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అది కూడా మైనస్సే. ఎంత మైనస్ అంటే చాలా వరకు అనవసరమైన సన్నివేశాలు కూడా ఇరికించేసేంత మైనస్ అనమాట.
5)ఈ సినిమాలో ఎటు చూసినా కామెడీ గురించే మాట్లాడుకోవాలి. సరైన పంచ్ డైలాగులు పడినప్పుడు నటీనటుల హావభావాలు పలకకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా కొంత పుష్ చేయాలి. ఇందులో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిచ్ గా ఉన్నా.. సీన్ కు సింక్ అయ్యే విధంగా లేదు. అది నేపధ్య సంగీతం మైనస్ అనలేము కానీ అనక తప్పదు.
6) హీరోయిన్ మారియా… ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఒలీవియా మోరిస్ లా తన నటన, హావభావాలతో అలరిస్తుంది అనుకుంటే.. ఆమె చాలా ఇబ్బంది పడుతూ నటించిన ఫీలింగ్ కలిగిస్తుంది.
7) సత్యరాజ్ పాత్ర కమెడియన్ కు ఎక్కువ, సహాయ నటుడి పాత్రకు తక్కువ అన్నట్టు ఉంటుంది.
8) విలన్ పాత్రలతో ఫేమస్ అయిన ఆనంద్ రాజ్ ఈ మధ్యన ఎక్కువగా తనకు సూట్ అవ్వని కామెడీ రోల్స్ చేస్తున్నాడు. ఇందులో కూడా అతని పాత్ర పండలేదు.
9) ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా.. సెకండాఫ్, క్లైమాక్స్ బాగుంటే సినిమా గట్టెక్కేసినట్టే..! ఇందులో అలా గొప్పగా చెప్పుకోవడానికి ఉండదు. సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకుంటే.. అక్కడికెళ్ళాక ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుందేమో అనుకుంటే.. అదీ మైనస్సే. ముందే బెటర్ అనిపిస్తుంది.
10)పాటల విషయంలో ‘బింబిలి’ తప్ప మిగిలినవి ఎక్కడా వినసొంపుగా ఉండవు.