సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్.. ఒకేసారి 10 సినిమాలు

సంక్రాంతి అనగానే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా చెక్ల సినిమాలు పొంగల్ ఫెస్టివల్ ను ఆసరాగా చేసుకుంటాయి. ఈ ఫెస్టివల్ కు వచ్చే సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు వస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సంక్రాంతికి వస్తాయని అనుకున్న సినిమాలలో చాలా వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఇక ప్రస్తుతం రాధేశ్యామ్, బంగార్రాజు సినిమాలపై అందరి ఫోకస్ కాస్త ఎక్కువగానే ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ఎనిమిది సినిమాలు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. అంటే ఈ సంక్రాంతికి మొత్తం పది సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద కాస్త హడావిడి మొదలు అయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ అనే సినిమాతో రాబోతున్నాడు. జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ సినిమా కూడా ప్రేక్షకులను ముందుకు రానుంది.

ఈ సినిమాల విడుదల తేదీ లో ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఈ సంక్రాంతికి రాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఇక జనవరి 15వ తేదీన మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ మొదటి సినిమా ‘హీరో’ విడుదల కాబోతోంది. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆది సాయి కుమార్ ‘అతిథిదేవోభవ’ జనవరి 7న విడుదల కానుండగా..

నిర్మాత ఎమ్మెస్ రాజు డైరెక్ట్ చేసిన ‘7 డేస్ 6 నైట్స్’ అలాగే దిల్ రాజు ‘రౌడీ బాయ్స్’ కూడా ఈ సంక్రాంతి కి రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. రౌడీ బాయ్స్ తో దిల్ రాజు ఇంట్లో నుంచి కూడా ఒక హీరో రాబోతున్నాడు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి ఈ సినిమాతో ఈ సంక్రాంతికి వస్తున్నట్లు తేల్చేశారు. ఇక రాజశేఖర్ ‘శేఖర్’ తో పాటు సంక్రాంతికి మరో సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus