భాషతో, పరభాషా నటులతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాల్ని చూసి ఎంజాయ్ చేయడం తెలుగు ప్రేక్షకులకి అలవాటు. అందుకే చాలా మంది పరభాషా హీరోల సినిమాలకి ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. రజినీకాంత్, కమల్ హాసన్ ల సినిమాలకి ఇక్కడ మంచి మార్కెట్ ఉండేది. తర్వాత విక్రమ్, సూర్య.. వంటి వారు కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ సినిమాలకి కూడా ఇక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే తమిళ జనాలు మాత్రం మన తెలుగు హీరోల సినిమాలను ఎంకరేజ్ చేయరు. ఎంత మంచి కంటెంట్ అయినా వాళ్ళ హీరోలు మాత్రమే చేయాలి. అలా అయితేనే చూసేవారు.
గతంలో చిరంజీవితో శంకర్ ఎందుకు సినిమాలు చేయలేదు అంటే.. ఆయన సన్నిహితుల దగ్గర చెప్పిన సమాధానం ఇది…’ చిరంజీవి గారు తెలుగులో పెద్ద స్టార్. కానీ మన తమిళ జనాలు తెలుగు హీరోల సినిమాలు చూడరు.. టాలీవుడ్ కంటే కోలీవుడ్ మార్కెట్ ‘ పెద్దది అని చెప్పారు. అలాగే హిందీలో కూడా ఇదే పరిస్థితి ఉండేది.అందుకే అప్పట్లో చాలా మంచి కంటెంట్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు కొట్టినాకొట్టినా పాన్ ఇండియా జోలికి మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అడుగులు వేయలేదు. గతంలో వచ్చిన తెలుగు సినిమాల్లో పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని సినిమాల్ని ఓ లుక్కేద్దాం రండి :
1) తాండ్ర పాపారాయుడు:
1986 వ సంవత్సరంలో కృష్ణంరాజు హీరోగా వచ్చిన ఈ మూవీలో పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది. దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకుడు.ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు గారు ఈ చిత్రానికి నిర్మాత.
2) సింహాసనం :
కృష్ణగారు నటించి దర్శకత్వం వహించి నిర్మించిన మూవీ ఇది. 1986 వ సంవత్సరంలోనే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కూడా పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది.
3) ఖైదీ :
చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీని కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1983 లో రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో చిరు కి స్టార్ డం ని తెచ్చిపెట్టింది.
4) ఆదిత్య 369 :
సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. ఇందులో పాన్ ఇండియా కంటెంట్ ఇందులో చాలా ఉంది.1991 లో ఈ మూవీ వచ్చింది.
5) జానకి రాముడు :
1988లో వచ్చిన మూవీ ఇది. రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి జంటగా నటించిన మూవీ. ఇందులో కూడా పాన్ ఇండియా కి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది.
6) బొబ్బిలి రాజా :
వెంకటేష్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. ఇందులో కూడా పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది.
7) గ్యాంగ్ లీడర్:
చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఈ మూవీని విజయ్ బాపినీడు డైరెక్ట్ చేశారు. 1991 లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో కూడా పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఉంటుంది.
8) సింహాద్రి :
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కూడా పాన్ ఇండియా కి రీచ్ అయ్యే కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.2003 లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.. కానీ అప్పట్లో రాజమౌళి ధైర్యం చేయలేకపోయారు.
9) పోకిరి :
మహేష్ బాబుని సూపర్ స్టార్ ను చేసిన మూవీ ఇది. ఇందులో కూడా పాన్ ఇండియా కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే చాలా వరకు ఈ మూవీ అన్ని భాషల్లోనూ రీమేక్ చేసుకున్నారు.
10) మగధీర :
రాజమౌళి దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కూడా పాన్ ఇండియా కంటెంట్ తో రూపొందిన మూవీనే. కొన్నాళ్ళ తర్వాత తమిళ్, మలయాళం లో రిలీజ్ చేశారు. హిందీలో రిలీజ్ చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ అప్పట్లో మానుకున్నారు. పాన్ ఇండియాకి రీచ్ అయ్యే కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉంటుంది.
పైన చెప్పిన లిస్ట్ లో ఉన్న మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాకపోవడం వల్ల బాహుబలి వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కే.జి.ఎఫ్, పుష్ప, కే.జి.ఎఫ్ 2, ఆర్ ఆర్ ఆర్ ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాలు రూపొంది సూపర్ హిట్లు అయ్యాయి. భవిష్యత్తు లో మరిన్ని సౌత్ సినిమాలు అందులోనూ తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావాలని కోరుకుందాం.