ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ స్పెషల్. అందులో సినీ స్టార్స్ ఇంకా స్పెషల్. ఒక్కో నటుడిది ఒక్కో తీరు. అయితే తెలుగు స్టార్స్, తమిళ స్టార్స్ లో ఉన్న కథల ఎంపిక, డైలాగ్ డెలివెరీ ని వంటి చిన్న పోలికలను బట్టి వారిద్దరూ ఒకటే అనే భావన రావడం సహజం. అలా టాలీవుడ్ హీరోలకు సరి సమానమైన కోలీవుడ్ హీరోలపై ఫోకస్..
1. చిరంజీవి, రజనీకాంత్క్రమ శిక్షణ, అంకితభావం, పట్టుదలను బలాలుగా మలుచుకొని స్టార్ లుగా ఎదిగిన గొప్ప నటులు చిరంజీవి, రజనీకాంత్. తన సినిమాల ద్వారా బాక్స్ ఆఫీస్ కి కొత్త లెక్కలను చూపించిన కమర్షియల్ హీరోలు వీరు.
2. బాలకృష్ణ, విజయ్ కాంత్వేదిక ఏదైనా, ఎంతమంది ఉన్నా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కథానాయకులు బాలకృష్ణ, విజయ్ కాంత్. అంతేకాకుండా వీరిలో మరో పోలిక ఏమిటంటే నటులుగా ఉంటూ రాజకీయాల్లోనూ రాణించారు.
3. పవన్ కళ్యాణ్, విజయ్యువకుల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న స్టార్లు పవన్ కళ్యాణ్, విజయ్. వీరు తెరపైన కనిపిస్తే విజిల్స్ హోరెత్తుతుంది. వీరి సినిమాలు విడుదలైన థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఉంటుంది.
4. మహేష్ బాబు, అజిత్రియల్ లైఫ్ లో సింపుల్ గా, రీల్ లైఫ్ లో సూపర్ గా ఉండే నటులు మహేష్ బాబు, అజిత్. అందంలో, నటనలో వీరికి వీరే సాటి. ఇద్దరూ హీరోయిన్లనే జీవిత భాగస్వాములుగా చేసుకున్నారు.
5. తారక్, సూర్యయాక్షన్ సీన్లను వేటాడేసే నటులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూర్య. వీరి ఫైట్స్ కోసమే చాలా మంది సినిమాలకు వెళుతుంటారు. ఎమోషన్ సీన్లతోను ఏడిపించగలరు.
6. అల్లు అర్జున్, ధనుష్స్టైల్ ఐకాన్ లు అల్లు అర్జున్, ధనుష్. వీరిద్దరూ సింపుల్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించారు. మొదట్లో వీరిద్దరిని చూసి.. “హీరోలా వీరు ..” అని ఎగతాళి చేసిన వారితోనే “హీరోలంటే వీరు” అని అనేలా చేసుకున్నారు. అంతగా సినిమాకు సినిమాకు డెవలప్ అయ్యారు.
7. రవి తేజ, విక్రమ్చలాకీ హీరోలు రవి తేజ, విక్రమ్. వీరిద్దరూ కష్టాన్ని నమ్ముకుని విలక్షణమైన పాత్రలను పోషిస్తూ మంచి స్థాయికి వచ్చారు. రవి తేజ, విక్రమ్ ల ఎనర్జీ సూపర్.
8. నాని, కార్తీసహజ నటనతోనే పరిశ్రమల్లో ఓ గుర్తింపు పొందిన వారు నాని, కార్తీ. ఇద్దరిని వెండి తెరపైన చూస్తుంటే మన పక్కింటి అబ్బాయిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే నాని, కార్తీ హీరోలుగా కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేశారు.
9. నితిన్, శింబుఉత్సాహవంతంగా అందమైన హీరోలు నితిన్, శింబు. వరుస విజయాలతో టాప్ హీరోల జాబితాలో చేరిన వీరే.. అధిక ఫ్లాప్ లతో కిందకు పడిపోయినా వీరే. అపజయాలు ఎదురైతే ఆత్మ విశ్వాసం కోల్పోకుండా పరిశ్రమలో నిలబడ్డారు.
10. గోపి చంద్, విశాల్మాస్ ప్రేక్షకుల మెప్పు పొందిన నటులు గోపి చంద్, విశాల్. వీరిద్దరూ ఎంచుకునే కథలు రియల్ లైఫ్ కి చాలా దగ్గరగా ఉంటాయి. సినిమాల్లో సరదాగా సాగిపోతూ అవసరమైనప్పుడు విరుచుకు పడుతుంటారు.