తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పడిన కొత్తల్లో గీత రచయితలకు, సంగీత దర్శకులకు సమాన గౌరవం లభించేది. సినిమాకు పాటల సిట్టింగ్ లో డైరక్టర్, హీరో, మ్యూజిక్ డైరక్టర్, గీత రచయిత ఉండేవారు. అప్పుడు ఒక చిత్రానికి ఒక్కరే పాటలన్ని రాసేవారు. ఒకరు ఉండడం వల్ల కథకు పాటలు బలమయ్యేవి. డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, ఆత్రేయలు ఎన్నో సినిమాలకు సింగిల్ గా పాటలు రాసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లకు మరుపురాని గీతాలను అందించారు. క్రమేణా ఆ సంప్రదాయం పోయింది. కె.విశ్వనాధ్, జంధ్యాల, వంశీ లాంటి దర్శకులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి లకు సింగిల్ కార్డు ఇచ్చారు. ఒక్కో పాట ఒకరు రాసే నేటి పరిస్థితుల్లో సింగల్ కార్డ్ అందుకున్న ఘనత రామ జోగయ్య శాస్త్రి కే దక్కింది. జనతా గ్యారేజ్ కి అన్ని పాటలు రాసి సింగిల్ కార్డ్ విధానానికి పునః స్వాగతం పలికారు. తన కలంతో అభిమానులను సంపాదించుకున్న ఈ గీత రచయిత నేడు (ఆగస్టు 24) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ జోగయ్య శాస్త్రికి ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అయన గురించి ఆసక్తికర సంగతులు…
01. రైతు కుటుంబం నుంచి రామ జోగయ్య శాస్త్రి వచ్చారు. తండ్రి సూర్య ప్రకాష్ రావు రైతు. తల్లి సరస్వతమ్మ గృహిణి. స్వస్థలం గుంటూరులోని ఆరెపల్లి గ్రామం.
02. రామ జోగయ్య శాస్త్రి నెంబర్ వన్ స్టూడెంట్. ఖరగ్ పూర్ లోని ఐఐటీ క్యాపస్ లో ఎం టెక్ పూర్తి చేశారు.
03. బీ టెక్ చదివే రోజుల్లో కొన్ని పాటలు రాసేవారు. తెలుగుతో పాటు కొన్ని కన్నడ పాటలు కూడా రాసారు అదే గీత రచయితను చేస్తాయని అప్పుడు రామ జోగయ్య శాస్త్రి అనుకోలేదు. అలా ప్రవేట్ సాంగ్స్ ఎన్నో రాశారు. వాటితో 40 దాకా ఆల్బమ్స్ విడుదల అయ్యాయి.
04. తొలి సారి కన్నడ హీరో వి.రవిచంద్రన్ సినిమాకు పాటలు రాసారు. ముందుగా కన్నడ పరిశ్రమలో రామ జోగయ్య శాస్త్రి గీత రచయితగా అడుగు పెట్టారు.
05. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ సహాయంతో ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి వద్ద రామ జోగయ్య శాస్త్రి శిష్యుడిగా జాయిన్ అయ్యారు. గురువు తనని అనేక విధాలుగా తీర్చిదిద్దారని రామ జోగయ్య పలు సందర్భాల్లో చెప్పారు.
06. మలయాళ సినిమాకు రీమేక్ అయినా యువ సేన చిత్రాలిని తొలి సారి తెలుగు పాటలు రాసారు. ఇందులో రాసిన రెండు పాటలకు తొలి రెమ్యునరేషన్ గా 20 వేలు అందుకున్నారు.
07. యువసేనకు పాటలు రాసే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రామ జోగయ్య శాస్త్రి కలిసి పని చేశారు. ఆ స్నేహంతో త్రివిక్రమ్ జల్సా సినిమాకు శాస్త్రి కి పాటలు రాసే ఛాన్స్ ఇచ్చారు.
08. రామ జోగయ్య శాస్త్రి నటుడిగాను మంచి మార్కులు కొట్టేశారు. కింగ్, శ్రీమంతుడు తదితర సినిమాల్లో నటించి అలరించారు.
09. ఖలేజా లోని “సదా శివ సన్యాసి” పాటకు గాను రామ జోగయ్య శాస్త్రి ఫిల్మ్ ఫెర్ అవార్డు అందుకున్నారు.
10. దూకుడు లోని “గురువారం మార్చి ఒకటి” సాంగ్ తో సైమా అవార్డును రామ జోగయ్య శాస్త్రి సొంతం చేసుకున్నారు.