ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు పూర్తి కావస్తోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ తర్వాత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘సలార్’ రికార్డుల మోత మోగించింది. కానీ వీకెండ్ తర్వాత ‘సలార్’ బుకింగ్స్ తగ్గాయి. సినిమాని ఎక్కువ రేట్లకి కొనుగోలు చేశారు కొందరు బయ్యర్స్. అందువల్ల ‘సలార్’ బ్రేక్ ఈవెన్ కి కష్టపడుతుంది.
తెలుగు వెర్షన్ పరంగా ‘సలార్’ నాన్ – బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘బాహుబలి 1 ‘ కలెక్షన్స్ ని కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ బయ్యర్స్ లాభాల బాట పట్టారు. నార్త్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే 2023 లో ‘పఠాన్’ ‘జవాన్’ సినిమాల్లా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం అయితే ‘సలార్’ విషయంలో కనిపించడం లేదు.
కనీసం ‘యానిమల్’ లా రూ.800 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సులు కూడా కనిపించడం లేదు. దీనికి ప్రధానంగా ఒక్కటే కారణం. ‘సలార్’ కి చిత్ర బృందం ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు. రిలీజ్ తర్వాత అయినా కొంచెం ప్రమోట్ చేసి ఉంటే.. కచ్చితంగా కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. రూ.1000 మార్క్ ని ఈజీగా అందుకునే ఛాన్స్ ఉండేది.
కానీ ఇప్పటికి (Salaar) ‘సలార్’ రూ.600 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గరే ఆగిపోయింది. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. థియేటర్స్ దొరకడం చాలా కష్టం. కాబట్టి ‘సలార్’ ఇక ఎంత కలెక్ట్ చేసినా అది ఈ వారం, పది రోజుల్లోనే కలెక్ట్ చేయాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!